PM Narendra Modi: కాంగ్రెస్‌ వస్తే దేశమంతటా కర్ణాటక మోడల్‌ | Sakshi
Sakshi News home page

PM Narendra Modi: కాంగ్రెస్‌ వస్తే దేశమంతటా కర్ణాటక మోడల్‌

Published Fri, Apr 26 2024 5:16 AM

Lok sabha elections 2024: PM Narendra Modi Attacks Congress Over Muslim Quota In Karnataka

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపాటు  
 

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను, హక్కులను కాజేసే కుట్ర  
 

దొడ్డిదారిన ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నదే కాంగ్రెస్‌ కుతంత్రం  
 

ఆస్తులు కాపాడుకోవడానికే రాజీవ్‌ గాంధీ ఎస్టేట్‌ డ్యూటీ రద్దు చేశారు  
 

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ   

ఆగ్రా/మొరేనా: సార్వత్రిక ఎన్నికల వేళ ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శల దాడిని రోజురోజుకూ ఉధృతం చేస్తున్నారు. సంపద పునఃపంపిణీ, ఓబీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ను ఇరుకున పెడుతున్నారు. ప్రజలు కష్టపడి సంపాదించి, దాచుకున్న సొమ్మును దోచేయడానికి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను, హక్కులను దొడ్డిదారిన కాజేసి, ఓటు బ్యాంక్‌కు కట్టబెట్టడానికి కాంగ్రెస్‌ పెద్ద కుట్ర పన్నిందని మరోసారి నిప్పులు చెరిగారు. గురువారం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో, బరేలీ, షాజహాన్‌పూర్, మధ్యప్రదేశ్‌లోని మొరేనా నగరంలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలన్నదే కాంగ్రెస్‌ లక్ష్యమని మండిపడ్డారు. ప్రధానమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే...  

అడ్డుగోడను నేను..  
‘‘మన తల్లులు, అక్కచెల్లెమ్మల సొత్తుపై కాంగ్రెస్‌ నాయకులు గురిపెట్టారు. అధికారంలోకి రాగానే తస్కరించాలని కుట్ర పన్నారు. మన ఆడపడుచుల సొమ్మును ఎవరూ దోచుకెళ్లకుండా నేను కాపలాదారుడిగా పనిచేస్తున్నా. మహిళలకు ఎల్లప్పుడూ అండగా ఉంటా. ప్రజలకు, కాంగ్రెస్‌కు మధ్య ఒక అడ్డుగోడగా నేను నిల్చున్నా. ప్రజల ఆస్తులను కాంగ్రెస్‌ దోచుకోకుండా కాపాడుతున్నా. 
 

జనం ఆస్తులను, సంపదను ఎక్స్‌–రే తీస్తామని కాంగ్రెస్‌ రాజకుమారుడు అంటున్నారు. ప్రజలపై వారసత్వ పన్ను విధించాలని మరో కాంగ్రెస్‌ నాయకుడు చెబుతున్నారు. ఎవరైనా ఆస్తి సంపాదించి మరణిస్తే అందులో 55 శాతం ఆస్తిని స్వా«దీనం చేసుకొని, మిగతా 45 శాతం ఆస్తిని వారసులకు ఇస్తారట! ఇదెక్కడి న్యాయమో అర్థం కావడం లేదు.   మతపరమైన రిజర్వేషన్లను మన రాజ్యాంగం అనుమతించదు. అయినా కాంగ్రెస్‌ పార్టీ మతం ఆధారంగా మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతోంది. తద్వారా రాజ్యాంగాన్ని కించపరుస్తోంది. 
 

మతం ఆధారంగా రిజర్వేషన్ల వ్యవస్థ తీసుకొచ్చేందుకు ఇప్పటిదాకా కాంగ్రెస్‌ చేసిన ప్రయత్నాలను కోర్టులు తిరస్కరించాయి. అందుకే ఆ పార్టీ దొడ్డిదారిని ఎంచుకుంది. మైనార్టీలను ఓబీసీ కోటాలో చేర్చి రిజర్వేషన్లు ఇచ్చేస్తోంది. కర్ణాటకలో ముస్లింలను ఇప్పటికే చట్టవిరుద్ధంగా ఓబీసీ కేటగిరీలో చేర్చి, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ కాంగ్రెస్‌ పదేపదే ఈ విషయం చెబుతోంది. మేనిఫెస్టోలో కూడా చేర్చింది. 
 

కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తొలుత ఆంధ్రప్రదేశ్‌లోనే ముస్లిం రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. కేంద్రంలో అధికారంలోకి రాగానే కర్ణాటక మోడల్‌ను దేశమంతటా అమలు చేయాల న్నదే కాంగ్రెస్‌ కుయుక్తి.  నేను కూడా ఒక ఓబీసీనే. కర్ణాటక మోడల్‌ నాకు ఆందోళన కలిగిస్తోంది. ఇక సామాన్య ప్రజల సంగతి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. 
 

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను, హక్కులను ఎవరూ తస్కరించకుండా రక్షణ కల్పించడానికి ఎన్నికల్లో 400 సీట్లు ఇవ్వాలని మేము అడుగుతున్నాం. ఒకవేళ కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే.. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల కుటుంబాల్లో రెండు ఉద్యోగాలు ఉంటే అందులో ఒకటి బలవంతంగా లాగేసుకుంటారు. ముస్లింలకు కట్టబెడతారు. ఇలాంటి బుజ్జగింపు రాజకీయాలు మన దేశాన్ని ముక్కలు చేస్తాయని అందరూ తెలుసుకోవాలి. సంతుïÙ్టకరణ(ప్రజలను పూర్తిస్థాయిలో సంతృప్తిపర్చడం) ద్వారా తుషీ్టకరణ(బుజ్జగింపు)ను అంతం చేయాలన్నదే మా ప్రయత్నం.   
 

అసలు లోగుట్టు ఇదే..
ఎస్టేట్‌ డ్యూటీ(పన్ను)ని అప్పట్లో ప్రధాని రాజీవ్‌ గాంధీ రద్దు చేశారని కాంగ్రెస్‌ నాయకులు గొప్పగా చెబుతున్నారు. నిజానికి ఇందిరా గాంధీ మరణం తర్వాత ఆమె ఆస్తులను ప్రభుత్వం స్వా«దీనం చేసుకోకుండా కాపాడుకోవడానికి ఎస్టేట్‌ డ్యూటీని కుమారుడు రాజీవ్‌ గాంధీ రద్దు చేశారు. అసలు లోగుట్టు ఇదే. ఇందిరా గాంధీ నుంచి బదిలీ అయిన ఆస్తులను ఆమె కుటుంబంలో నాలుగు తరాలు చక్కగా అనుభవించాయి. ఇందిరా గాంధీ మరణం కంటే ముందు ఎస్టేట్‌ డ్యూటీతో భారీగా లాభపడిన కాంగ్రెస్‌ ఇప్పుడు అదే విధానం తీసుకురావాలని భావిస్తోంది. బీజేపీ ఉన్నంతకాలం కాంగ్రెస్‌ ఆటలు సాగవు. జనం ఆస్తులను కాజేసే ప్రయత్నాలను కచి్చతంగా తిప్పికొడతాం.

Advertisement

తప్పక చదవండి

Advertisement