'దాడి ఏక్షణంలోనైనా జరగొచ్చు.. జాగ్రత్త'

27 Dec, 2015 10:55 IST|Sakshi
'దాడి ఏక్షణంలోనైనా జరగొచ్చు.. జాగ్రత్త'

వియెన్నా: నూతన సంవత్సర వేడుకలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆస్ట్రేలియా పోలీసులు యూరోపియన్ దేశాలను హెచ్చరించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఏ క్షణంలోనైనా దాడులు చేసే ప్రమాదం ఉందని, ఈ విషయంలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉండకూడదని సూచించింది. దాడులు బాంబుల రూపంలోగానీ, కాల్పుల రూపంలోగానీ ఉండొచ్చని హెచ్చిరించింది. గత నెల రోజుల కిందట ఫ్రాన్స్ జరిగిన దాడి కారణంగా దాదాపు 130 మంది ప్రాణాలుకోల్పోయిన విషయం తెలిసిందే.

ఈ దాడి అనంతరం అప్రమత్తమైన ఆస్ట్రేలియా ఉగ్రవాదుల కదలికలను ఎప్పటికప్పుడూ పసిగడుతూ ఆ విషయాలని తమ మిత్ర దేశాలకు పంచుకుంది. ఫ్రెండ్లీ ఇంటెలిజెన్స్ సేవల్లో భాగంగా ఇస్లామిక్ స్టేట్ వ్యూహాలను తెలుసుకునేందుకు ప్రయత్నించింది. తాము చేసిన విచారణ ప్రకారం ఏ క్షణంలోనైనా ఏ ప్రాంతంలోనైనా ఉగ్రవాదులు బాంబుల రూపంలోగానీ, కాల్పులతోగానీ విరుచుకుపడే ప్రమాదం ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

మరిన్ని వార్తలు