బీర్ హాప్స్‌తో కేన్సర్‌కు చెక్..!

22 Mar, 2016 09:55 IST|Sakshi
బీర్ హాప్స్‌తో కేన్సర్‌కు చెక్..!

వాషింగ్టన్: బీర్ హాప్స్.. బీరును తయారీకి వాడే ఒక రకం పువ్వులు. వీటిలో ఉండే రసాయనాలు కేన్సర్‌కు దివ్యౌషధంగా పనిచేస్తాయట. కేన్సర్‌నే కాదు పలు బ్యాక్టీరియాలను, ఇతర వ్యాధులను కూడా నియంత్రించవచ్చట. బీర్ హాప్స్‌లో ఉన్న వ్యాధి నిరోధక కారకాలపై  శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. త్వరలోనే ఆరోగ్యకరమైన ఇలాంటి హాప్స్‌ను కృత్రిమంగా టేబొరేటరీల్లో తయారు చేసే దిశగా పరిశోధనలు సాగిస్తున్నారు. హాప్స్‌లో ఉన్న రసాయనాల్లో తమకు కావాల్సిన ఆరోగ్యకారకమైన రసాయనాలను గుర్తించే వేరుచేసే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు.  పరిశోధనకు నేతృత్వం వహించిన వర్సిటీ ఆఫ్ ఇదహో శాస్త్రవేత్త క్రిస్టోఫర్ వేనంట్ పరిశోధన వివరాలు తెలిపారు.

  ‘హాప్స్‌లో హుములోనెస్, లుపులోనెస్  మిశ్రమాలను గుర్తించాం. హుములోనెస్ అనేవి ఆల్ఫా యాసిడ్స్ , వీటిలో కేన్సర్ నిరోధక కారకాలుంటాయి.  లుపులోనెస్ అనేవి బెటా యాసిడ్స్. ఇవి కూడా ఆరోగ్యానికి సహాయపడేవే. ఈ యాసిడ్స్‌కు కేన్సర్ సెల్స్‌ను నశింపజేసే శక్తి ఉందని, అలాగే లుకేమియా సెల్స్‌ను కూడా నియంత్రిస్తాయి. ఈ రెండింటిని కలిపే ప్రక్రియను కొనసాగిస్తున్నాం’ అని చెప్పారు.

మరిన్ని వార్తలు