భారతీయులకు శుభవార్త.. గ్రీన్‌కార్డుపై కొత్త బిల్లు

11 Jan, 2018 14:03 IST|Sakshi

వాషింగ్టన్:  అమెరికాలోభారతీయులు ఊరట కల్పించి  కీలక పరిణామం చోటు చేసుకుంది. రిట్-ఆధారిత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను పునరుద్ధరించాలని, గ్రీన్ కార్డ్‌  వార్షిక కేటాయింపులను 45 శాతానికి  పెంచాలని కోరుతూ ఒక ప్రతిపాదనను అమెరికా ప్రతినిధులు సభలో ప్రవేశపెట్టారు. తాజా బిల్లు ప్రకారం ప్రస్తుతం కేటాయిస్తున్న  గ్రీన్‌ కార్డుల సంఖ్య సంవత్సరానికి లక్ష 20వేలనుంచి ఒక లక్ష, 75వేలకు  పెరగనుంది. ఈ ప్రతిపాదనతో  గ్రీన్‌ కార్డుకోసం వేచిచూస్తున్న  5లక్షల మంది భారతీయులకు లబ్ది చేకూరతుందని అంచనా.

ఈ బిల్లు ప్రకకారం  గ్రీన్ కార్డుల కేటాయింపు సంవత్సరానికి 1,20,000 నుండి 1,75,000 లకు పెంచాలని  సభ్యులు ప్రతిపాదించారు. హెచ్1బి వీసాతో అమెరికాలో అడుగుపెడుతున్న భారత ఐటీ ఇంజనీర్లు  ఆ తర్వాత గ్రీన్ కార్డు (శాశ్వత నివాస)హోదా పొందుతున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  గ్రీన్‌కార్డు కొనసాగింపుపై చేసిన ప్రకటన అందోళన రేకెత్తించింది. అయితే ఈ కొత్త బిల్లు చట్టంగా మారితే భారత ఐటీ ఇంజనీర్లకు ప్రయోజనం చేకూరుతుందన్న విశ్లేషణ వినిపిస్తోంది.

కాగా అమెరికాలో నివాస హోదా కల్పించే గ్రీన్ కార్డులను సొంతం చేసుకునే వారిలో సింహ భాగం భారతీయులేనన్న విషయం తెలిసిందే. ట్రంప్ సర్కారు మద్దతుతో ప్రతినిధుల సభ ముందుకు చేరిన ఈ బిల్లు ఆమోదం పొంది, అద్యక్షుడి సంతకం కూడా పూర్తయి చట్టంగా మారితే, ప్రస్తుతమున్న వైవిధ్య వీసా కార్యక్రమానికి చెక్ పడతుందని భావిస్తున్నారు.
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు