Ram Charan: ఫెర్రారీ కారులో చరణ్.. రేటు తెలిస్తే మైండ్ బ్లాంక్ గ్యారంటీ!

22 Nov, 2023 17:10 IST|Sakshi

టాలీవుడ్‌లో పలువురు హీరోల దగ్గర ఖరీదైన కార్లు ఉన్నాయి. ఈ లిస్టులో మెగాహీరో రామ్ చరణ్ కచ్చితంగా ఉంటాడు. మార్కెట్‌లోకి కొత్త మోడల్ రావడం లేటు. దాన్ని తన గ్యారేజీలోకి తెచ్చేస్తుంటాడు. ఇప్పుడు అలానే ఓ ఖరీదైన కారులో డ్రైవ్ చేస్తూ కనిపించాడు. దాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో అదికాస్త వైరల్ అయిపోయింది.

(ఇదీ చదవండి: ఆడిషన్స్‌కు వెళ్తే పాతిక లక్షలడిగారు: బిగ్ బాస్ సన్నీ)

మెగా పవర్‌స్టార్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్నాడు. షూటింగ్ జరుగుతుందో లేదో తెలీదు గానీ చరణ్ అయితే హైదరాబాద్ లోనే ఉన్నాడు. తాజాగా కొన్నాళ్ల క్రితం కొన్న ఫెర్రారీ కారు తీసుకుని డ్రైవ్ కి వెళ్లాడు. తిరిగి ఇంట్లోకి వెళ్తున్న టైంలో ఒకరు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో సదరు ఫెర్రారీ కారు, దాని కాస్ట్.. మరోసారి డిస్కషన్‌లోకి వచ్చింది.

చరణ్ దగ్గరున్న ఫెర్రారీ కారు ఖరీదు దాదాపు రూ.మూడున్నర కోట్లు అని అంటున్నారు. దీనితో పాటు మరో అరడజను కార్లు కూడా చరణ్ దగ్గరున్నాయి. ఇంతకీ అవేంటి? వాటి ఖరీదు ఏంటనేది కింద లిస్ట్ ఉంది చూసేయండి.

రామ్ చరణ్ కార్స్ కలెక్షన్

  • రోల్స్ రాయిస్ ఫాంటూమ్ — రూ 9.57 కోట్లు
  • మెర్సిడెస్ మేబాచ్ జీఎల్ఎస్ 600 - రూ.4 కోట్లు
  • ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ వీ8 - రూ. 3.2 కోట్లు
  • ఫెర్రారీ ఫోర్టోఫినో - రూ 3.50 కోట్లు
  • రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ 2.75 కోట్లు
  • బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ - రూ 1.75 కోట్లు
  • మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఈ 450 ఏఎమ్‌జీ కూప్ - రూ. కోటి

(ఇదీ చదవండి: ఎవిక్షన్ పాస్ గెలుచుకున్న రైతుబిడ్డ.. ఆమెని దెబ్బకొట్టడం గ్యారంటీ!?)

A post shared by abhi's photography📸 (@abhi__photographyy)

మరిన్ని వార్తలు