నాలుగేళ్ళ తర్వాత.. ఇరాన్లో బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్..

2 Sep, 2016 17:03 IST|Sakshi
నాలుగేళ్ళ తర్వాత.. ఇరాన్లో బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్..

తెహ్రాన్ః బ్రిటిష్ ఎయిర్వేస్ పాసింజర్ విమానం నాలుగేళ్ళ తర్వాత ఇనాన్ లో ల్యాండ్ అయ్యింది. 2012 అక్టోబర్లో ఇరాన్ నిషేధం విధించిన తర్వాత మొదటిసారి శుక్రవారం బ్రిటిష్ ఎర్వేస్ విమానం ప్రయాణీకులతో ఇరాన్ చేరుకుంది.

లండన్ హెత్రో ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరిన  బోయింగ్ 777 విమానం ఉదయం గం.6.15 నిమిషాలకు ఇరాన్ లోని ఇమామ్ ఖొమైనీ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయినట్లు జిన్హువా న్యూస్ వెల్లడించింది. ఇకపై వారానికి ఆరు విమానాలు లండన్ నుంచి తెహ్రాన్ కు నడపనున్నట్లు బ్రిటిష్ ఎయిర్వేస్ వెల్లడించింది. ఎనిమిది సంవత్సరాల విరామం తర్వాత ఏప్రిల్ లో ఎయిర్ ఫ్రాన్స్ సేవలు ప్రారంభించగా... బ్రిటిష్ ఎయిర్వేస్ ఇరాన్ లో ల్యాండ్ అయిన రెండో యూరోపియన్ ఎయిర్ లైన్స్ విమానంగా చెప్పాలి. ఇరాన్ రాజధానిలో 1946 సంవత్సరంలో మొదటిసారి బ్రిటిష్ ఎయిర్వేస్ తన సేవలను ప్రారంభించింది. ఇరాన్ కు వ్యతిరేకంగా కొన్ని ఆంక్షలు ఎత్తివేయడంలో భాగంగా బ్రిటిష్ ఎయిర్వేస్ ఇరాన్ కు విమానాలు నడపడం ప్రారంభించింది.

మరిన్ని వార్తలు