బుల్లివాళ్ల ‘బుల్‌రైడ్’

28 Jun, 2015 01:40 IST|Sakshi
బుల్లివాళ్ల ‘బుల్‌రైడ్’

పెద్దవాళ్లకు బుల్‌రైడ్, బుల్‌ఫైట్ ఉన్న ప్పుడు పిల్లలకేం తక్కువ! అందుకే, పిల్లలకు తగ్గట్టుగా ఇది షీప్‌రైడ్. దీన్నే ‘మటన్ బస్టిన్ కాంపిటీషన్’ అంటారు. ఇది పూర్తిగా వినోదం కోసమే. పిల్లల్లోని చురుకుదనాన్ని పరీక్షించడం కోసం కూడా! కాకుంటే 24 కిలోలకన్నా తక్కువ బరువున్నవాళ్లే ఇందులో పాల్గొనడానికి అర్హులు.

ముందు గొర్రెను చిన్న ఇనుపఖానాలో ఉంచి, దానిమీద పిల్లాడ్ని కూర్చోబెట్టి, గొర్రెను నెమ్మదిగా బయటికి వదులుతారు. అది పిల్లాడ్ని వదిలించుకోవడం కోసం పరుగెడు తుంది. దాంతో పిల్లలు జారిపడిపోతారు. ఎవరు ఎక్కువసేపు గొర్రె మీద స్వారీ చేస్తే వాళ్లే విజేత! గెలిచిన వారికి బహుమతులుంటాయి. అమెరికాలోని కెంటకీలో జరిగిన ‘గరార్డ్ కంట్రీ ఫెయిర్’లోని దృశ్యమిది.

>
మరిన్ని వార్తలు