200మందికి ఎయిడ్స్ ఎక్కించిన దొంగ వైద్యుడు

3 Dec, 2015 11:55 IST|Sakshi
200మందికి ఎయిడ్స్ ఎక్కించిన దొంగ వైద్యుడు

పినోమ్ పెన్: వైద్యో నారయణో హరి అని అంటుంటారు.. అంటే వైద్యుడు ప్రత్యక్ష దైవం అని చెప్తారు. సృష్టిలో ఈ వృత్తిలో ఉన్నవారిని మాత్రమే ప్రత్యక్ష దైవసమానంగా చూడటం పరిపాటి. ఇంతటి గొప్ప వృత్తిలో ఉన్న ఓ నకిలీ వైద్యుడు చేయకూడని తప్పిదానికి పాల్పడ్డాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 200మందికి పైగా ఎయిడ్స్ వ్యాపించేందుకు కారణమయ్యారు. ఈ వృత్తిని చేపట్టిన ఆ వైద్యుడికి లైసెన్సు కూడా లేదు. ఈ తప్పిదానికి పాల్పడినందుకు గురువారం కాంబోడియా కోర్టు అతడికి 25 ఏళ్ల కారాగార శిక్షను విధించింది. యెమ్ చరిన్ (57) అనే వ్యక్తి లైసెన్సు లేకుండానే వైద్య వృత్తి చేపట్టాడు.

బట్టామాబాంగ్ ప్రావిన్స్ లోని రోఖా అనే గ్రామీణ తెగకు తనకు వచ్చి రాని వైద్యంతో డబ్బుసంపాధించడం మరిగాడు. ఈ క్రమంలో అతడు దాదాపు 200మందికి పైగా ఎయిడ్స్ రావడానికి కారణమయ్యాడు. వారిలో పదిమందికి పైగా ఇప్పటికే చనిపోయారు కూడా. ఈ క్రమంలో అతడిని గత ఏడాది 2014లో అరెస్టు చేశారు. ఇతడు ఒకరికి ఉపయోగించిన నీడిల్ ను మరొకరికి ఉపయోగించిన కారణంగా 200మందికి పైగా ఎయిడ్స్ సోకింది. వీరంతా కూడా 15 నుంచి 49ఏళ్ల మధ్య వయసు ఉన్నవారే. ఇతడికి 25 ఏళ్ల జైలు శిక్షను విధించడంతోపాటు భారీ మొత్తంలో ఫైన్ కూడా వేశారు.
 

మరిన్ని వార్తలు