చైనాలో తొలి సైబర్‌ కోర్టు ప్రారంభం

19 Aug, 2017 02:04 IST|Sakshi
చైనాలో తొలి సైబర్‌ కోర్టు ప్రారంభం

బీజింగ్‌: ఇంటర్నెట్‌కు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి తన తొలి సైబర్‌ కోర్టును చైనా ప్రారంభించింది. జెజియాంగ్‌ ప్రావిన్స్‌లో ఈ–కామర్స్‌ సంస్థలకు కేంద్రమైన హాంగ్జూ నగరంలో ఈ కోర్టును ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌లో వాణిజ్య వివాదాలతో పాటు కాపీరైట్‌ చట్టం ఉల్లంఘనలను ఈ న్యాయస్థానం విచారిస్తుందని చైనా అధికారిక పత్రిక జిన్జువా పేర్కొంది.

సైబర్‌ కోర్టుకు న్యాయమూర్తులతో పాటు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని హాంగ్జూ మున్సిపాలిటీ ఇప్పటికే నియమించినట్లు తెలిపింది. ఈ కోర్టులో విచారణ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే జరుగుతుందని వెల్లడించింది. ఈ ఏడాది జూన్‌ నాటికి చైనాలో ఇంటర్నెట్‌ను వినియోగించేవారి సంఖ్య 751 మిలియన్లకు చేరుకున్నట్లు పేర్కొంది.

మరిన్ని వార్తలు