బీజింగ్‌లో కరోనా.. సూపర్‌ స్ర్పెడ్డర్‌ అతనేనా!

24 Jun, 2020 10:51 IST|Sakshi

బీజింగ్‌ : కరోనా వైరస్‌ పుట్టుకకు చైనా కారణమన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కడ మొదలైన కరోనా వైరస్‌ ఖండాంతరాలు దాటి ప్రపంచవ్యాప్తంగా ఇంకా విజృంభణ చేస్తూనే ఉంది. తాజాగా చైనా రాజధాని బీజింగ్‌లో కొత్తగా కరోనా కేసులు వెనుక డెలివరీ మ్యాన్‌ ఉన్నట్లు తెలుస్తుంది. బీజింగ్‌లో కరోనా వేగంగా విస్తరించడం వెనుక సూపర్‌ స్ప్రెడ్డర్‌ ఇతనేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫుడ్‌ డెలివరీ మ్యాన్‌గా పనిచేస్తున్న 47 ఏళ్ల వ్యక్తి కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డాడు. బీజింగ్‌లో నమోదైన మొదటి కరోనా కేసు ఈ వ్యక్తిదే కావడం విశేషం. ఇతను జూన్‌ 1 నుంచి 17వరకు బీజింగ్‌లోని డాక్సింగ్‌, ఫాంగ్షాన్, డాంగ్చెంగ్, ఫెంగ్టై జిల్లాల్లో ఫుడ్‌ డెలివరీ అందించాడు. కాగా జూన్‌ 11 నుంచి 22 వరకు చూసుకుంటే బీజింగ్‌లో మొత్తం 249 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనిని బట్టి చూస్తే బీజింగ్‌ నుంచి వివిధ ప్రాంతాలకు ఫుడ్‌ డెలివరీ చేసిన సదరు వ్యక్తే సూపర్‌ స్ప్రెడ్డర్‌ అనే అనుమానాలకు బలం చేకూరుస్తుంది. అతను కరోనా బారిన పడినప్పటి నుంచి దాదాపు రెండు వారాల పాటు యావరేజ్‌గా 50 ఫుడ్‌ ఆర్డర్‌లను డెలివరీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. (ద. కొరియాపై సైనిక చర్య: ఆదేశాలు నిలిపివేసిన కిమ్‌!)

బీజింగ్‌లో మంగళవారం కొత్తగా 29 కేసులు వెలుగుచూడగా,  కరోనా లక్షణాలు ఉన్న మరో 99 మందిని అబ్జర్వేషన్‌లో ఉన్నట్లు మెడికల్‌ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు దాదాపు 2.3 మిలియన్‌ మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు బీజింగ్‌ హెల్త్‌ కమిషన్‌ పేర్కొంది. చైనా అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 83,148 మంది కరోనా బారిన పడగా వారిలో 359 మంది చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. వీరిలో 78,425 మంది రికవరీ అవ్వగా, మృతుల సంఖ్య 4634గా ఉంది. (భారత్‌: ఒక్కరోజే 15968 పాజిటివ్‌ కేసులు)

మరిన్ని వార్తలు