పిల్లలు సింహాన్ని భయపెట్టి పరుగెత్తించారు

8 May, 2017 17:06 IST|Sakshi
పిల్లలు సింహాన్ని భయపెట్టి పరుగెత్తించారు

లండన్‌: ఒక విషయం గురించి తెలియనప్పుడు భయపడుతుంటాం. ఈ భయం జంతువులకు కాస్తంత ఎక్కువగా ఉంటుంది. అందుకే జన సంచారంలో ఉండే జంతువులుతప్ప మిగితావి తమ ఆ‍త్మరక్షణకోసం వెనుకాముందు చూడకుండా ప్రతిఘటించేందుకే ప్రయత్నిస్తుంటాయి. ఈ కోవలో సింహం మినహాయింపు కాదు. తొలుత కాస్తంత ఆగినట్లు కనిపించినా ఆ వెంటనే తన పంజా పవర్‌ ఏమిటో చూపిస్తుంది. కానీ, చిన్నపిల్లలు ఓ సింహాన్ని తోకముడిచేలా చేశారు. భయంతో పారిపోయేలా బెదిరించారు. అది కూడా ఓ నీటి బుడగతో. అదెలా అని అనుకుంటున్నారు.

బ్రిటన్‌లోని పారాడైజ్‌ వైల్డ్‌ లైఫ్‌ పార్క్‌లో మోటో అనే ఒక తెల్ల సింహం ఉంది. దానిని చూస్తేనే ఒళ్లు గగుర్లు పొడుస్తుంది. అలాంటి సింహాన్ని చూసేందుకు వచ్చిన పిల్లలు ఆడుకుంటూ ఓ నీటి బుడగను వదిలారు. అది కాస్త సింహం ఉన్న బోనులోకి మెల్లగా జారిపడుతుండగా దానిని ఎంతో దగ్గరిగా ఆసక్తిగా చూసిన సింహం అది కిందపడి టప్‌మనే శబ్ధంతో పగిలిపోగానే భయంతో తోకముడిచింది. వెంటనే ఆ ప్రదేశాన్ని వదిలి తన గుహలోకి పారిపోయింది. దీనిని చూస్తున్నవారంతా మృగరాజుకు కూడా ఎంత భయం అనుకుంటూ పడిపడి నవ్వుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో, యూట్యూబ్‌లో తెగ హల్‌చల్‌ చేస్తోంది.

మరిన్ని వార్తలు