అమ్మో! అమ్మాయేనా?

3 Jul, 2016 20:56 IST|Sakshi
అమ్మో! అమ్మాయేనా?

ఈ బొమ్మను చూస్తుంటే చేయి తిరిగిన చిత్రకారుడు గీసిన పెయింటింగ్ లా ఉంది కదూ. కానీ ఇది చేత్తో వేసిన పెయింటింగ్ ఎంతమాత్రం కాదు. అలెక్సా మీడే తన కెమెరా ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం ఈ చిత్తరువు. లాస్ ఏంజెలెస్ కు చెందిన ఆమె మనుషులకు రంగులు అద్ది అత్యద్భుత చిత్రాలకు ప్రాణం పోస్తోంది. మోడల్స్ దేహానికి, ముఖాలకు నేరుగా పెయింటింగ్ వేసి తనదైన శైలిలో త్రీడీ, టూడీ ఫొటోలు తయారు చేస్తోంది. ఈ ఫొటోలను చూసిన వారంతా చేత్తో వేసిన పెయింటింగ్స్ అనుకుంటున్నారంటే ఆమె పనితనం ఎంతో అద్భుతంగా ఉందో తెలుస్తోంది.

నటి డొమినికా జుల్లెట్ తో తాజాగా అలెక్సా మీడే రూపొందించిన 12 ఫొటోల కేలండర్ సిరీస్ ఎంతోగానే ఆకట్టుకుంటోంది. 2009లో ఈ విభాగంలో ప్రయోగాలు చేస్తున్న అలెక్సా మీడేకు ఇన్స్టాగ్రామ్ లో 56,000 మంది అభిమానులున్నారు. 2 లక్షల మంది ఫేస్బుక్ ఫాలోవర్లు ఉన్నారు. మనుషులకు రంగులద్ది ప్రయోగాలు చేయడం తనకు ఇష్టమని అలెక్సా మీడే తెలిపింది. ఇలాంటి చిత్రాలు చూపు మరల్చుకోవ్వవని చెప్పింది. ఇలాంటి ఫొటోలు ఒక్కరోజులో తయారు చేయడమే తన లక్ష్యామని పేర్కొంది.

'బ్యాగ్రౌండ్ పెయింటింగ్, క్లాత్స్ కు 8 గంటలు పడుతుంది. మోడల్ కు పెయింటింగ్ వేయడానికి మరో గంట కేటాయించాలి. 2 లేదా 3 గంటలు ఫొటోగ్రఫీకి పడుతుంద'ని వెల్లడించింది. పెయింటింగ్ పూర్తైన తర్వాతే అసలైన పని మొదలవుతుందని, ఫొటోలు తీయడానికి చాలా శ్రమిస్తానని చెప్పింది. ఇలాంటి ఫొటోలు ఎల్లకాలం మదిలో నిలిచిపోతాయని అభిప్రాయపడింది.


మరిన్ని వార్తలు