భారతీయులూ.. వెంటనే వెనక్కి వచ్చేయండి!!

25 Mar, 2015 18:35 IST|Sakshi
భారతీయులూ.. వెంటనే వెనక్కి వచ్చేయండి!!

యెమెన్ దేశంలో విపరీతంగా ఘర్షణలు జరుగుతుండటంతో అక్కడున్న భారతీయులంతా వెంటనే స్వదేశానికి వచ్చేయాలని భారత ప్రభుత్వం కోరింది. ఏ రకమైన రవాణా సాధనాలు అందుబాటులో ఉన్నా వెంటనే వాటిని పట్టుకుని వెనక్కి వచ్చేయాలని భారతీయును కోరుతున్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. యెమెన్లో ఉన్న భారతీయుల్లో చాలామంది నర్సింగ్ వృత్తిలోనే ఉన్నారు.

వాళ్లంతా పరిస్థితి తీవ్రతను గుర్తించి.. వెనక్కి వస్తారని భావిస్తున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పారు. సుమారుగా అక్కడ 3 వేల నుంచి 3,500 మంది వరకు భారతీయులు ఉంటారన్నారు. యెమెన్ అధ్యక్షుడితో పాటు అక్కడి ప్రభుత్వంలో ఉన్న పెద్దవాళ్లపై షియా మిలిషియా వర్గలు దాడులకు తెగబడుతున్నాయి. సనాలో ఉన్న భారతీయ రాయబార కార్యాలయం భారతీయులకు సాయం చేసేందుకు ప్రత్యేకంగా హెల్ప్లైన్లు ఏర్పాటుచేసింది.

మరిన్ని వార్తలు