15 ఏళ్లకే ఇంజినీర్‌ అయ్యాడు!

29 Jul, 2018 13:33 IST|Sakshi

అబ్బురపరుస్తున్న భారత సంతతి బాలమేధావి!

వాషింగ్టన్‌ : ప్రతిభకు వయస్సు అడ్డంకి కాదు. ఈ విషయాన్ని మరోసారి నిరూపించాడు తనిష్క్‌ అబ్రహం.. చిన్నవయస్సులోనే అపారమైన మేధస్సుతో అబ్బురపరుస్తున్న ఈ బాలమేధావి మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 15 ఏళ్లకే ఇంజినీర్‌గా పట్టభద్రుడు అయ్యాడు. యూసీ డేవిస్‌ విద్యాసంస్థ నుంచి బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ పట్టా పొందాడు. భారత సంతతికి చెందిన తనిష్క్‌ అబ్రహం తన మేధస్సుతో అమెరికాలో విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. చిన్నవయస్సులోనే చదువులో అసాధారణ ప్రతిభ చాటుతూ.. మూడేళ్ల కిందటే మూడు డిగ్రీలు పొందాడు. ఇప్పుడు తాజాగా బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడైన తనిష్క పీహెచ్‌డీ చేసి.. డాక్టరేట్‌ పట్టా పొందాలని భావిస్తున్నాడు.

15వ ఏట అడుగుపెట్టడానికి కొన్నిరోజుల ముందే ఫాదర్స్‌ డే సందర్భంగా తనిష్క్‌ ఈ డిగ్రీ పట్టా పొందాడు. అక్కడితో అతను ఆగిపోలేదు. వెంటనే యూసీ డేవిస్‌ మెడికల్‌ సెంటర్‌లో తన సీనియర్‌ డిజైన్‌ ప్రాజెక్టును సమర్పించాడు. అనంతరం సదరన్‌ కాలిఫోర్నియాలో జరిగిన బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ సదస్సులో పాల్గొని.. తన పరిశోధన ప్రాజెక్టు డిజైన్‌ను సమర్పించాడు. అంతేకాకుండా యూసీడీ ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్‌ అకాడెమీలో నిర్వహించిన 3రోజుల క్రాష్‌కోర్సులోనూ అతను చేరాడు.

బాలమేధావి తనిష్క్‌ అబ్రహంకు సంబంధించి మరిన్ని కథనాలు..

అమెరికా అధ్యక్ష పదవిపై బాలుడి గురి

ఈ బుడ్డోడు సూపర్‌ ఫాస్ట్‌!

10 ఏళ్లకే హైస్కూల్ విద్య పూర్తి!

మరిన్ని వార్తలు