ఆ గ్రహం పై ఓ సెల్ఫీ

23 Aug, 2015 10:37 IST|Sakshi
ఆ గ్రహం పై ఓ సెల్ఫీ

వాషింగ్టన్: సెల్ఫీల ట్రెండ్ భూమిని దాటి అంగారక గ్రహాన్ని కూడా తాకింది. క్యూరియాసిటీ రోవర్ అరుణ గ్రహంపై తీసుకున్న సెల్ఫీలను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) విడుదల చేసింది. రోవర్కు ఉన్న ఏడు అడుగుల రోబోటిక్ చేయిని సెల్ఫీ స్టిక్గా ఉపయోగించి ఈ సెల్ఫీలను తీసుకుంది. మార్స్ పై పరిశోధనల కోసం నాసా, క్యూరియాసిటీ రోవర్ను పంపిన విషయం తెసిందే.


అంగారక గ్రహంపై గతంలో ఉన్న ప్రదేశంలోనే చాలా వారాలు గడిపిన క్యూరియాసిటీ రోవర్ ఇటీవలే సిలికా, హైడ్రోజన్ సమృద్ధిగా ఉన్న జియలాజిక్ కాంటాక్ట్ జోన్, శిలలను పరీక్షించడానికి కొత్త ప్రాంతానికి వెళ్లింది. అక్కడి నుండి నైరుతి దిశగా కదులుతూ మౌంట్ షార్ప్ పర్వతం వైపు కదులుతుంది. 2012లో అంగారకుడిపై ల్యాండ్ అయినప్పటి నుంచి క్యూరియాసిటి అక్కడ 11 కిలోమీటర్లు ప్రయాణించింది.

>
మరిన్ని వార్తలు