ఈ జూన్ 30న ఒక సెకను పెంచుకోవాల్సిందే!

30 Jun, 2015 16:07 IST|Sakshi
ఈ జూన్ 30న ఒక సెకను పెంచుకోవాల్సిందే!

వాషింగ్టన్: ఒక రోజుకు ఎన్నిగంటలు, ఎన్ని నిమిషాలు అంటే కనీస పరిజ్ఞానం ఉన్న వారెవరైనా చెప్పేస్తారు? రోజుకు ఎన్ని సెకన్లు ఉంటాయని అడిగితే మాత్రం కచ్చితంగా చెప్పడం కాస్త కష్టంగానే ఉంటుంది. అయితే జూన్ 30వ తేదీ మన దీర్ఘకాలిక జ్ఞాపకంలో చెరగని ముద్ర వేసే అవకాశం ఉంది. సాధారణంగా రోజుకు 86, 400 సెకన్లు. కాగా, ఈ జూన్ 30 మాత్రం మామూలు రోజుకన్నా కాస్త ఎక్కువగా ఉంటుందట.  జూన్ 30 వ తేదీకి అదనంగా ఒక లీపు సెకను ఎందుకు జోడించాల్సి వచ్చిందో అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం(నాసా) వెల్లడించింది. భూమి తన చుట్టూ తిరిగే పరిభ్రమణ కాస్త తగ్గుతూ ఉండటంతో ఆ లోటును భర్తీ చేయడానికి అదనంగా ఒక లీపు సెకనును జోడించినట్లు నాసా పేర్కొంది.

 

ప్రపంచవ్యాప్తంగా యుటిసిగా పికోర్డినేటెడ్ యూనివర్సల్ టైమింగ్ విషయానికి మాత్రమే ఇది వర్తిస్తుంది. యుటిసి అనేది ఆటోమేటిక్ టైమ్. ఈ కచ్చితమైన సమయం ఇప్పుడు తెలియకపోయినా.. 14,00,000 సంవత్సరాలకు ఒకసారి సమయ మార్పు తెలిసే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం భూ పరిభ్రమణం తగ్గుతూ రావడంతో ఇలా ఒక సెకను అదనంగా జోడించాల్సి వచ్చిందట. దీంతో జూన్ 30 వ తేదీకి 86, 401 సెకన్లుగా  నిర్ణయించాల్సి వచ్చిందని నాసా తెలిపింది. ఒక రోజు 23:59:59 సెకన్ల వద్ద ముగిసి 00:00:00తో ప్రారంభమవుతుంది. జూన్ 30 వ తేదీన 23:59:60 సెకన్ల వద్ద ముగిసి 00:00:00 తో ఆరంభం కానుంది. గత 15 సంవత్సరాల నుంచి ఈ జూన్ వరకూ చూస్తే ఇలా లీపు సెకను పెంచడం నాల్గోసారి.  ఇలా అరుదుగా జరిగే విషయాలు మనలో ఆసక్తిని పెంచినా..  ఆరోజు నుంచి గడియారాల్లో ఒక సెకనును అదనంగా పెంచుకుందామా మరి.

మరిన్ని వార్తలు