అక్కడ మాంసాహారం నిషిద్ధం..

2 May, 2015 13:57 IST|Sakshi
అక్కడ మాంసాహారం నిషిద్ధం..

కఠ్మాండు: తీవ్ర భూకంపంతో నేలమట్టమైన నేపాల్లో  జంతువులు, పక్షుల వేటను, మాంసాహారాన్ని  నిషేధించారు.  అంటువ్యాధులు ప్రబలే అవకాశం  ఉందని భావించిన కఠ్మాండు ప్రభుత్వం  వేటను, మాంసాహారాన్ని నిషేధిస్తూ  ఆదేశాలు జారీ చేసింది. మాంసాహారం భుజించడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం  ఉన్నందున, మాంసం, సంబంధిత ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ నోటీసులు జారీ చేసింది. పారిశుద్ధ్యం, ప్రజల ఆరోగ్య సంరక్షణార్థం  తామీ నిర్ణయం తీసుకున్నామని  కఠ్మాండు జిల్లా  అధికారి ఈకె నారాయణన్ తెలిపారు.


ఇప్పటివరకు ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 6,600మందిని పొట్టన పెట్టుకున్న భూకంపం లక్షలాదిమందిని క్షతగాత్రులుగా మార్చింది.  వేలాది మంది నిరాశ్రయులయ్యారు.  వరుస భూకంపాలతో చిగురుటాకుల్లా వణికిపోయిన ప్రజలు  ఇళ్లల్లోకి వెళ్లడానికి  భయపడిపోయారు.  ఆరుబయటే టెంట్లలో కాలం గడుపుతున్నారు. ఎక్కడా చూసినా అపరిశుభ్రమైన వాతావరణం నెలకొంది.  చాలా మంది ప్రజలు అనారోగ్యం బారిన పడినట్టు తెలుస్తోంది.   ఈ నేపథ్యంలోనే అంటువ్యాధులు ప్రబలే అవకాశం  ఉందని, అప్రమత్తంగా ఉండాలని అనేక ఏజెన్సీలు  హెచ్చరించిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు