శిథిలాలను పరీక్షిస్తున్న ఎమ్హెచ్ 370 శోధన బృందం

10 Jun, 2016 09:11 IST|Sakshi
శిథిలాలను పరీక్షిస్తున్న ఎమ్హెచ్ 370 శోధన బృందం

సిడ్నీ : అదృశ్యమైన మలేషియా ఎయిర్ లైన్స్కు చెందిన ఎమ్హెచ్ 370 విమానం మిస్టరీ ఛేదించేందుకు ఆస్ట్రేలియా నిరంతరాయంగా శోధన కొనసాగిస్తుంది. అందులోభాగంగా ఇటీవల నూతనంగా దొరికిన శిథిలాలను ఆస్ట్రేలియా శోధన బృందం పరిశీలిస్తుందని ఆ దేశ ట్రాన్స్ఫోర్ట్ సేఫ్టీ బ్యూరో అధికార ప్రతినిధి శుక్రవారం సిడ్నీలో వెల్లడించారు. మెడగాస్కర్లో లభించిన శిథిలాలను ఇప్పటికే పరిశీలించినట్లు చెప్పారు.

ఆస్ట్రేలియాలోని దక్షిణ కోస్తా తీరంలో దొరికిన ఓ శిథిలం పూర్తిగా శిథిలమైందని పేర్కొన్నారు. ఆ మూడు శిథిలాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.ఇప్పటి వరకు ఎనిమిది శిథిలాలు లభించాయని... అవన్నీ పశ్చిమ ఆస్ట్రేలియా తీరంలోనివే అని స్పష్టం చేశారు. వాటిలో ఐదు మాత్రం ఈ విమానానికి చెందినవి అయి ఉండవచ్చు అని అన్నారు. మరో మూడు శిథిలాలను మాత్రం పరీక్ష చేస్తున్నట్లు చెప్పారు.

2014 మార్చి 8వ తేదీన 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎమ్హెచ్ 370 విమానం మలేసియా నుంచి చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది. ఆ విమానంలో బయలుదేరిన కొద్ది సేపటికే గల్లంతైంది. ఆ విమాన ఆచూకీ కోసం ప్రపంచ దేశాలు కలసి జల్లెడ పట్టిన ఇప్పటి వరకు వీసమెత్తు ఆచూకీ కూడా కనుక్కోలేకపోయిన సంగతి తెలిసిందే.ఈ విమాన ఆచూకీ కోసం ఆస్ట్రేలియా శోధన బృందం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది.

మరిన్ని వార్తలు