షబానా, జావేద్‌లపై పాక్‌ విమర్శలు

18 Feb, 2019 11:42 IST|Sakshi

కరాచీ: బాలీవుడ్‌ సీనియర్‌ నటి షబానా అజ్మీ, ఆమె భర్త జావేద్‌ అక్తర్‌ తమ దేశ పర్యటన రద్దు చేసుకోవడాన్ని పాకిస్తాన్‌ ఆర్ట్స్‌ కౌన్సిల్‌ విమర్శించింది. కరాచీలో జరగనున్న షబానా తండ్రి కైఫీ అజ్మీ శతజయంతి వేడుకలకు వీరిద్దరూ హాజరుకావాల్సివుంది. జమ్మూకశ్మీర్‌ పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో పాకిస్తాన్‌ పర్యటన రద్దు చేసుకున్నారు.

షబానా, జావేద్‌ నిర్ణయాన్ని పాకిస్తాన్‌ ఆర్ట్స్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు అహ్మద్‌ షా తప్పుబట్టారు. తమను షబానా నిరాశకు గురి​చేశారని వ్యాఖ్యానించారు. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తామని చెప్పారు. జావేద్‌ అక్తర్‌ ధైర్యముంటే కశ్మీర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సాగిస్తున్న అరాచకాలపై గళమెత్తాలని సూచించారు. ఈనెల 23, 24 తేదీల్లో కరాచీలో నిర్వహించనున్న కైఫీ అజ్మీ శతజయంతి వేడుకలకు పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ రచయితలు, కవులతో పాటు ప్రపంచ దేశాల నుంచి ప్రముఖులను ఆహ్వానించారు.

మరిన్ని వార్తలు