నువ్వుంటే నా జతగా..

6 Apr, 2015 01:54 IST|Sakshi
నువ్వుంటే నా జతగా..

నీ జతగా నేనుండాలి.. నీ ఎదలో నేనిండాలి.. అంటూ చలికాలంలో మంచు కురిసే ఓ ఉదయాన.. తమ జంటను ఆరాధనా పూర్వకంగా పిలుస్తున్నాయి ఈ పక్షులు.. సారస్ అనే ఈ పక్షులు ఒకసారి ఏదైనా పక్షితో ప్రేమలో పడితే జీవితాంతం దానితోనే గడుపుతాయట.. జతకట్టే ముందు సొగసైన నృత్యమూ చేస్తాయట..  తొలి భారతీయ మహిళా వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ రతిక రామసామి తీసిన అరుదైన చిత్రాల్లో ఇదొకటి.. రాజస్థాన్‌లోని కెవ్‌లాదేవ్ జాతీయ పార్కులో ఈ ఫొటోను ఆమె క్లిక్‌మనిపించారు.

మరిన్ని వార్తలు