ప్రతిపక్షంలో చేరిన ప్రధాని సోదరుడు

24 Jun, 2020 12:16 IST|Sakshi

సింగపూర్: దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సింగపూర్ ప్రస్తుత ప్రధానమంత్రి లీ సియాన్ లూంగ్ కు షాక్ తగిలింది. ఆయన సోదరుడు లీ సియాన్ యాంగ్ బుధవారం ప్రతిపక్ష ప్రొగ్రెస్ సింగపూర్ పార్టీ (పీఎస్‌పీ)లో చేరారు. ఈ ఏడాది జులై 10న జరగబోయే ఎన్నికల్లో లూంగ్ కు చెందిన పీపుల్స్ యాక్షన్ పార్టీ(పీఏపీ)కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని యాంగ్ పేర్కొన్నారు.(బీజింగ్‌లో కరోనా.. సూపర్‌ స్ర్పెడ్డర్‌ అతనేనా!)

పీఎస్‌పీ నుంచి బరిలోకి దిగే విషయంపై మాత్రం మాట దాటేశారు. వీరి తండ్రి మోడరన్ సింగపూర్ వ్యవస్థాపకుడు లీ కువాన్ యూ ఆస్తుల పంపక వ్యవహారంలో తేడాలు రావడంతో అన్నదమ్ముల మధ్య అగాథం ఏర్పడింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అది తారస్థాయికి చేరింది.(సోదరి ఆదేశాలు.. సైనిక చర్య వద్దన్న కిమ్‌!)

మరిన్ని వార్తలు