బెయిల్పై వచ్చిన ఆరు రోజులకే ..

16 Dec, 2014 13:38 IST|Sakshi
బెయిల్పై వచ్చిన ఆరు రోజులకే ..

ఆస్ట్రేలియా: సిడ్నీ కెఫే ఉదంతంపై ఆస్ట్రేలియా ప్రభుత్వం మంగళవారం విచారణకు ఆదేశించింది. ఆ ఘటనపై విచారణ ప్రారంభమైంది. నిందితుడు మోనిస్ బెయిల్పై జైలు నుంచి వచ్చిన ఆరురోజులకే ఈ దారుణానికి తెగబడినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే ఇప్పటికే 40 అభియోగాలు ఎదుర్కొంటున్న  మోనిస్కు బెయిల్ ఎలా వచ్చిదంటూ స్థానికులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.  బెయిల్ చట్టాన్ని మరింత కఠినతరం చేయాలంటూ ఆస్ట్రేలియన్ వాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఈ ఘటనలో ఉగ్రవాది మోనిస్ చేతిలో గాయపడిన కెఫే అసిస్టెంట్ మేనేజర్ టోరి జాన్సన్ (34) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు.  ఆస్ట్రేలియాలో సుప్రసిద్ధ ఆర్టిస్టు జెన్ జాన్సన్ కుమారుడు టోరి జాన్సన్ అని పోలీసులు తెలిపారు. ఉగ్రవాది మోనిస్ నుంచి టోరి జాన్సన్ తుపాకీ లాక్కునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో జాన్సన్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు