రెలైక్కి.. ప్రపంచాన్ని చూసేద్దాం..

20 Mar, 2014 00:41 IST|Sakshi
రెలైక్కి.. ప్రపంచాన్ని చూసేద్దాం..

 లండన్, న్యూయార్క్, వాషింగ్టన్, షికాగో, లాస్‌ఏంజెలిస్, శాన్‌ఫ్రాన్సిస్కో, బీజింగ్, షాంగాయ్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, మాస్కో, గోబీ ఎడారి, మంగోలియా, సైబీరియా, వార్సా, ప్రేగ్, వియన్నా, వెనీస్, ఆస్ట్రియా, ఫ్రాన్స్.. ఇంకా అయిపోలేదు.. ఇంకా చాలా ఉన్నాయి.. వీటన్నిటినీ ఒకేసారి కూ..చుక్‌చుక్ రైలులో చుట్టేయాలనుందా? అదీ ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన రైళ్లలో.. వచ్చే ఏడాది ఈ అద్భుత ప్రయాణాన్ని ప్రారంభించేందుకు గ్రేట్ రైల్ జర్నీస్ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 53 రోజుల్లో వీటన్నిటినీ తిప్పి, తెస్తారు. ఇందుకు టికెట్ చార్జీ కింద ఒక్కొక్కరి నుంచి రూ.22 లక్షలు వసూలు చేస్తారు. లండన్‌లో మొదలెట్టి.. మళ్లీ లండన్‌కు తిరిగి తీసుకొస్తారు. దాదాపుగా 40 వేల కిలోమీటర్ల ప్రయాణమన్నమాట. కొన్ని దేశాలకు వెళ్లేందుకు రైలు సదుపాయం లేకపోతే.. అలాంటిచోట్ల విమానంలో తీసుకెళ్తారు.
 

మరిన్ని వార్తలు