ఇరుక్కుపోయిన ట్రంప్‌ భార్య.. బయటలొల్లి

7 Jul, 2017 19:03 IST|Sakshi
ఇరుక్కుపోయిన ట్రంప్‌ భార్య.. బయటలొల్లి

హాంబర్గ్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భార్య ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ హాంబర్గ్‌లోని అతిథి గృహంలో ఇరుక్కుపోయారు. హాంబర్గ్‌లో జీ 20 శిఖరాగ్ర సమావేశానికి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె బయటకు రాలేక లోపలే ఉండిపోయారు. ఒక్క ట్రంప్‌ భార్య మాత్రమే కాకుండా ఇతర దేశాల ప్రతినిధుల సతీమణులు కూడా అందులోని ఉండిపోవాల్సి వచ్చిందట.

అయితే, జీ 20 సదస్సులో భాగంగా వారికి పలు కార్యక్రమాలు ఉండగా ఆందోళన కారణంగా బయటకు రాకుండానే ఉండాల్సి వచ్చిందని అక్కడి మీడియా తెలిపింది. ‘ఆందోళనల కారణంగా అతిథి గృహం నుంచి బయటకు వెళ్లేందుకు హాంబర్గ్‌ పోలీసులు మాకు ఇంకా అనుమతి ఇవ్వలేదు’ అని ట్రంప్‌ అధికారిక ప్రతినిధి స్టీఫెన్‌ గిరీషం మీడియాకు చెప్పారు. వాతవరణ కేంద్రానికి వారు వెళ్లకుండానే నేరుగా వాతావరణ శాస్త్రవేత్తలే హాంబర్గ్‌లో హోటల్‌లో వారికి ప్రసంగాలు ఇచ్చే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
 

మరిన్ని వార్తలు