నైట్‌ డ్యూటీలతో డీఎన్‌ఏకు చేటు

28 Jan, 2019 15:51 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బీజింగ్‌: రాత్రిపూట విధులు నిర్వర్తించే వారిలో డీఎన్‌ఏకు ముప్పు పొంచి ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. దీనివల్ల కేన్సర్, హృదయ, జీవక్రియ, నాడీ వ్యవస్థకు సంబంధించి వ్యాధులు వచ్చే అవకాశముందని తెలిపింది. ఫుల్‌ టైమ్‌ విధులు నిర్వర్తించే 49 మంది వైద్యుల రక్త నమూనాలను వివిధ సమయాల్లో సేకరించి యూనివర్సిటీ ఆఫ్‌ హాంగ్‌కాంగ్‌ పరిశోధకులు అధ్యయనం చేశారు.

‘ఈ పని చాలా చిన్నదైనప్పటికీ స్పష్టమైన ఫలితాలు వెల్లడయ్యాయి. రాత్రి పూట విధులు నిర్వర్తించే వారిలో నిద్రలేమి సమస్య కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇటు డీఎన్‌ఏ సైతం దిబ్బతింటోంది. ఇదే దీర్ఘకాలిక వ్యాధులను ప్రేరేపించేందుకు దోహదపడుతోంది..’ అని పరిశోధకుల్లో ఒకరైన సియూ–వై చోయ్‌ చెప్పారు. అలాగే డీఎన్‌ఏ ఎంత దెబ్బ తింటే అంతగా నిద్రలేమి సమస్య తీవ్రమవుతోందని వెల్లడించారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు