లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌: చిరు వ్యాపారుల నిరసన

10 Apr, 2020 16:58 IST|Sakshi

బీజింగ్‌: కరోనా వైరస్‌ మహమ్మారి జన్మస్థలం వూహాన్‌లో లాక్‌డౌన్‌ ఎత్తివేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడి చిన్న చిన్న దుకాణాల యజమానులు వారి అద్దె తగ్గించాలని కోరుతూ వుహాన్‌లోని అతిపెద్ద  గ్రాండ్‌ ఓషన్‌ డిపార్టుమెంటు షాపింగ్‌ మాల్స్‌ ఎదుట శుక్రవారం నిరసన చేపట్టారు. ఈ క్రమంలో సామాజిక దూరం పాటిస్తూనే మొహనికి మాస్క్‌లు ధరించి ప్లకార్డులు పట్టుకుని  స్టోర్‌ ఎదుట మోకాళ్లపై దీక్ష చేపట్టారు. కాగా దీక్షకు ముందు రోజు వారంతా ‘సంవత్సరం అద్దె మినహాయింపు ఇవ్వాలని లేదా తమ లీజు ఒప్పందాన్ని తిరిగి ఇవ్వమని’ చైనీస్‌ సోషల్‌ మీడియాలో వీడియో అప్‌లోడ్‌ చేశారు. (వూహాన్‌లో లాక్‌డౌన్‌ ఎత్తివేత)

ఇక షాపింగ్‌ మాల్‌లో ఓ దుకాణాన్ని అద్దెకు తీసుకున్న మహిళా మాట్లాడుతూ.. ‘లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపారం జరగలేదు. కాబట్టి షాపింగ్‌ మాల్‌ యజమానులు అద్దె మినహాయింపు ఇవ్వాలన్నారు. ఎందుకంటే నిరసనలో పాల్గొన్న 99 శాతం మంది నిరసనకారులు చిరు వ్యాపారాలు చేసుకుని జీవనం సాగించేవారే. ఇక లాక్‌డౌన్‌ కారణంగా ఎటువంటి వ్యాపారాలు జరగలేదు. వూహాన్‌లోనే కాదు పోరుగు ప్రాంతాల వ్యాపారులు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. వారంత కూడా నిరసనలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని పేర్కొంది. (నెట్‌వర్క్‌ కోసం చెట్లు ఎక్కుతూ అంపైర్‌ పాట్లు!)

అలాగే మరో నిరసనకారుడు మాట్లాడుతూ.. ‘మేము నిరసన చేపట్టినప్పటీ నుంచి ఇంతవరకూ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం అన్నాడు. పైగా పోలీసులు మాపై దాడి కూడా చేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా గతేడాది డిసెంబర్‌లో వుహాన్‌ నగరంలో బయటపడిన ఈ ప్రాణాంతక వైరస్‌ ప్రస్తుతం ప్రపంచమంతా కోరలు చాస్తుంది. ఈ వైరస్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటీ వరకు 1,615, 587 కరోనా కేసులు నమోదు కాగా, 96, 794 మంది మృతి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు