ముగ్గురు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్‌

22 Jan, 2018 07:48 IST|Sakshi

పేలుడు సామగ్రి స్వాధీనం

ఎస్పీ అంబర్‌కిషోర్‌ ఝా వెల్లడి

కొత్తగూడెం:  మావోయిస్టు పార్టీ కొరియర్లు ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి పేలుడు సామాగ్రి స్వాధీనపర్చుకున్నారు. కొత్తగూడెంలో ఎస్పీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఎస్పీ అంబర్‌ కిషోర్‌ ఝా ఈ విషయం తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాలు...

మావోయిస్టు కొరియర్లు పేలుడు సామాగ్రితో వెళుతున్నారన్న సమాచారంతో భద్రాచలం, చర్ల ప్రాంతాల్లో వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. చర్ల, భద్రాచలం వద్ద పేలుడు సామాగ్రితో వెళుతున్న ముగ్గురిని పట్టుకున్నారు. వారిని విచారించారు. తాము మావోయిస్టు కొరియర్లుగా పనిచేస్తున్నట్టు వారు చెప్పారు. చర్ల వద్ద మడివి సమ్మయ్యను, ఓయం నందను, భద్రాచలం వద్ద మిర్గం అర్జున్‌ను అరెస్ట్‌ చేశారు. మావోయిస్టు పార్టీ నాయకులైన చంద్రన్న, ఆనంద్, పాపారావు, మదన్న, హరిభూషణ్, ఇద్దమయ్య, దామోదర్‌ దళాలకు ఇచ్చేందుకు ఈ పేలుడు సామాగ్రిని తీసుకెళుతున్నట్టు చెప్పారు. వీరిని పూర్తిస్థాయిలో విచారిస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశముంది. ఈ ముగ్గురి నుంచి 51 జిలెటిన్‌ స్టిక్స్, 130 డిటోనేటర్లు, ఎలక్ట్రికల్‌ వైర్లు స్వాధీనపర్చుకున్నారు. సమావేశంలో భద్రాచలం ఏఎస్‌పీ సునీల్‌దత్, కొత్తగూడెం డీఎస్పీ ఎంఎస్‌ అలీ, బెటాలియన్‌ అధికారి కేసీ అహ్లవత్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ సుబ్బారావు, ఎంటీఓ సోములు, ఎస్పీ పీఆర్‌ఓ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు