30 ఏళ్లుగా ఆ అనుమానం ఉంది!

26 Jan, 2020 19:06 IST|Sakshi

మేము 3 సంవత్సరాలు అనంతపురంలో ఉన్నాం. అక్కడే నేను 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అక్కడే చదివాను. చాలా కష్టపడి చదివేదాన్ని. చదువే నా లోకం. నేను అక్కడ ఒక చోట ట్యూషన్‌లో చేరాను. చాలా బిడియం, అమాయకం. మగ పురుగును చూడటం కూడా తప్పు అని అనుకునేదాన్ని. ఒకబ్బాయి పేరు వరదరాజు. నన్ను నాకు తెలియకుండా రోజు చూసేవాడు. నా కోసం 9 వ  తరగతిలో ట్యూషన్‌ మానేసిన తను 10వ తరగతిలో నాకోసమే మా ట్యూషన్‌లో చేరాడు. నేను చాలా యాక్టివ్‌గా ఉండేదాన్ని. డ్రాయింగ్‌, సింగింగ్‌ ఇలా అన్నింటిలో పాల్గొనేదాన్ని. అతను కూడా నేను వెళ్లే ప్రతి కాంపిటిషన్‌కు వచ్చే వాడు. వాళ్లది బాయ్స్‌ స్కూల్‌. అతను నన్ను చాలా డీప్‌గా లవ్‌ చేస్తున్నాడని మా ఫ్రెండ్స్‌  చెప్తే నాకు తెలిసింది. నా పేరు ట్యూషన్‌లో ఉండే సోఫా మీద వందసార్లు రాశాడు. నేను ఎప్పుడైనా చూస్తే చాలు మా క్లాస్‌ గర్ల్స్‌ అందరూ చూసింది చూసింది అని అనేవారు. దాంతో ఏదో తప్పు చేసినట్లు తల దించుకుని స్టడీస్‌ మీద శ్రద్ద పెట్టేదాన్ని. 

హాలిడేస్‌ వస్తే చాలు నా కోసం మా వీధి చివర నిల్చునేవాడు. నేను వచ్చేంత వరకు అక్కడే ఉండేవాడు. నా టెన్త్‌ క్లాస్‌ ఎగ్జామ్స్‌ అప్పుడు ఏమి రాసేవాడో ఏమో కానీ నేను ఎగ్జామ్‌ సెంటర్‌కు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు నా వెంట వచ్చేవాడు. లాస్ట్‌ రోజు రొప్పుతూ నా దగ్గరకు వచ్చి నన్ను మిస్‌ అవుతున్నానని చెప్పాడు. తను నా కోసం చాలా ఉత్తరాలు రాశాడంట అది నేను  వినాలి అని చెప్పాడు. అప్పుడు నేను తనది చాలా స్ట్రాంగ్‌ లవ్‌ అని నమ్మాను. తరువాత హాలిడేస్‌లో మేం హైదరాబాద్‌ షిఫ్ట్‌ అయ్యాము. ఒక్కసారి కూడా నేను తనని సరిగా చూడలేదు, మాట్లాడలేదు. కానీ రిసెంట్‌గా స్వప్న మూవీలో లవ్‌ లెటర్స్‌  మూవీ చూశాక చాలా బాధపడ్డాను. నేను ఎంత ట్రూ లవ్‌ను మిస్సయ్యనో అనిపించింది. ఎలా తట్టుకున్నాడో నేను  వెళ్లిపోయాక. అసలు ఉన్నాడా అని నా డౌట్‌. 30 ఏళ్ల నుంచి నా మనస్సులో ఆ అనుమానం ఉంది. కానీ నేనేం చేయలేను. ఎక్కడ ఉన్నా సారీ చెప్పాలని ఉంది. ఆ లెటర్స్‌ చదవాలని ఉంది. చాలా సంఘటనలు ఉన్నాయి. తను నా కోసం చాలా ప్రయత్నాలు చేశాడు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఐయమ్‌ సారీ.

గౌరీ(అనంతపురం).


 

మరిన్ని వార్తలు