దేవుడా..వాళ్లని ఒప్పించు

25 Nov, 2019 14:34 IST|Sakshi

నేను(శ్రీ)ముద్దుగా తను నన్ను బుజ్జి అని ఎంతో ప్రేమతో పిలిచేది.  నేను కూడా తనని(శ్రావణి) ప్రేమతో పొట్టి అని పిలిచే వాడిని. అమ్మాయిలు లవ్‌ చేసినా వ్యక్తపరచడానికి మాత్రం చాలా సంశయిస్తారు. తరతరాల ఆచారం ప్రకారం​అబ్బాయే ముందుగా లవ్‌ ప్రపోజ్‌ చేయాలిఅనుకుంటారు.నా పొట్టి కూడా అంతే. నన్ను 9వ తరగతి నుంచి లవ్ చేస్తోంది అని వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నా. ఒకేఊరు,  కానీ కులాలు వేరు.

తను నన్ను ప్రేమిస్తుందన్న విషయం నాకు తెలిసిన తరువాత ఒక రోజు తను మా ఇంటికి వచ్చింది. ఆరోజు చాలా కొత్తగా అనిపించింది. తననే చూస్తూ ఉన్నాను. నాపై ఎంత ప్రేమ ఉందో తన కళ్లు చెబుతున్నాయి. తను నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కానీఆరోజు తను చాలా ప్రత్యేకంగా కనిపించింది. లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ అంటే ఏంటో ఆ క్షణం అర్థమైంది. ఆ రోజునుంచి నా గుండె చప్పుడు తనే అనిపించింది.

నా డ్రీమ్‌ గర్ల్‌కి మాటలతో కాకుండా డిఫరెంట్‌గా లవ్‌ ప్రపోజ్‌ చేయాలనుకున్నా. ప్రేమతో తనని తాకే స్పర్శ కన్నా డిఫరెంట్‌గా ఏముంటుంది? అందుకే ముద్దుతో తన కళ్ళలోకి చూస్తూ ప్రపోజ్‌ చేశాను. అదే నా ఫస్ట్‌ కిస్‌.  ఆ క్షణం మళ్ళీ తన కోసమే తల్లి స్వర్గం నుంచి జన్మించాను అనిపించింది. ఇక అప్పటినుంచి మా ప్రేమ పట్టాలకు హద్దుల్లేవు. మా ప్రేమ ప్రయాణం మొదలై 5 ఏళ్లు పూర్తికావస్తుంది. ఈఐదేళ్లలో మా మధ్య ప్రేమ ఇసుమంత కూడా తగ్గలేదు. తగ్గదు కూడా. మాకు ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రాణం. జీవితాంతం కలిసుండాలని
కోరుకుంటున్నాం. మా పెళ్లికి ఇరువర్గాల పెద్దల అంగీకారానికి ఎదురుచూస్తున్నాం. వాళ్లు ఒప్పుకునేలా చేయాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాం. 

    శ్రీ శ్రావణ్‌...143

మరిన్ని వార్తలు