నంది అవార్డులను ప్రకటించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం

1 Mar, 2017 19:51 IST|Sakshi
నంది అవార్డులను ప్రకటించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం

2012, 2013 సంవత్సరాలకు గాను నంది అవార్డులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. కొంత కాలంగా నంది అవార్డులను తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం ఇస్తుందన్న సస్పెన్స్కు తెర పడింది . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో కొత్త అవార్డులను ఇస్తామంటూ ప్రకటించిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2012, 2013 సంవత్సరాలకు గాను నంది అవార్డులను ప్రకటించింది.

2012 సంవత్సరానికి ప్రకటించిన అవార్డుల్లో ఈగ, ఎటోవెళ్లిపోయింది మనసు, మిథునం సినిమాలు పోటి పడ్డాయి. ఈగ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు అవార్డులతో కలిపి తొమ్మిది అవార్డులను సొంతం చేసుకోగా, ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాకు నాలుగు అవార్డులు దక్కాయి. మిథునంకు రెండు, మిణుగురులుకు ఐదు అవార్డులు దక్కాయి. ఎస్వీ రంగారావు పురస్కారానికి గాను ఆశిష్ విద్యార్థిని ఎంపిక చేశారు. సీనియర్ నటి జయసుథ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఎంట్రీ లను పరిశీలించి విజేతలను నిర్ణయించింది.

 

2012 నంది అవార్డుల వివరాలు :
ఉత్తమ చిత్రం : ఈగ
ద్వితీయ ఉత్తమ చిత్రం : మిణుగురులు
తృతీయ ఉత్తమ చిత్రం : మిథునం
ఉత్తమ దర్శకుడు : రాజమౌళి ( ఈగ )
ఉత్తమ నటుడు : నాని (ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ నటి : సమంత (ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ విలన్ : సుదీప్ (ఈగ)
ఉత్తమ సహాయ నటుడు : అజయ్ (ఇష్క్)
ఉత్తమ సహాయ నటి : శ్యామలా దేవి (వీరంగం)
ఉత్తమ హాస్య నటుడు : రఘుబాబు (ఓనమాలు)
ఉత్తమ బాలనటుడు : దీపక్ సరోజ్ (మిణుగురులు)
ఉత్తమ బాలనటి : రుషిణి ( మిణుగురులు)
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు : అయోద్య కుమార్ ( మిణుగురులు )
ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ : రాజమౌళి (ఈగ)
ఉత్తమ కథా రచయిత : అయోద్య కుమార్ ( మిణుగురులు)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : సెంథిల్ కుమార్ (ఈగ)
ఉత్తమ గాయకుడు : శంకర్ మహదేవన్ ( ఒక్కడే దేవుడు, శిరిడి సాయి)
ఉత్తమ గాయని : గీతామాధురి ( యదలో నదిలాగ, గుడ్ మార్నింగ్)
ఉత్తమ కళాదర్శకుడు : ఎస్ రామకృష్ణ ( అందాల రాక్షసి)
ఉత్తమ కొరియోగ్రాఫర్ : జానీ ( మీ ఇంటికి ముందో గేటు, జులాయి)
ఉత్తమ ఆడియో గ్రాఫర్ : కడియాల దేవీ కృష్ణ (ఈగ)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ : తిరుమల( కృష్ణంవందే జగద్గురుం)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ : చిట్టూరి శ్రీనివాస్ ( కృష్ణంవందే జగద్గురుం)
ఉత్తమ మాటల రచయిత : తనికెళ్ల భరణి (మిథునం)
ఉత్తమ గేయ రచయిత : అనంత్ శ్రీరామ్ (కోటికోటి తరల్లోనా, ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ సంగీత దర్శకుడు :  కీరవాణి(ఈగ), ఇళయరాజా(ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు (ఈగ)
ఉత్తమ ఫైట్స్ : గణేష్ ( ఒక్కడినే)
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ మేల్ : ఆర్ సీ యం రాజు (మిణుగురులు)
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫీమేల్ : శిల్ప (వీరంగం)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ : మకుట విఎఫ్ఎక్స్ ( ఈగ)
ఎస్వీ రంగారావు పురస్కారం : ఆశిష్ విద్యార్థి (మిణుగురులు)

 

2013 సంవత్సరానికి గాను మిర్చి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలకు అవార్డుల పంట పండింది.

ఉత్తమ చిత్రం : మిర్చి
రెండో ఉత్తమ చిత్రం : నా బంగారు తల్లి
మూడో ఉత్తమ చిత్రం : ఉయ్యాల జంపాల
ఉత్తమ కుటుంబ కథా చిత్రం : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం : అత్తారింటికి దారేది
ఉత్తమ హీరో : ప్రభాస్ (మిర్చి)
ఉత్తమ హీరోయిన్ : అంజలి పాటిల్  (నా బంగారు తల్లి)
ఉత్తమ దర్శకుడు : దయా కొడవగంటి (అలియాస్ జానకి)
ఉత్తమ సంగీత దర్శకుడు : దేవీ శ్రీ ప్రసాద్ (అత్తారింటికి దారేది)
ఉత్తమ సహాయ నటుడు : ప్రకాష్ రాజ్ (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)
ఉత్తమ సహాయ నటి : నదియా (అత్తారింటికి దారేది)
ఎస్వీ రంగారావు పురస్కారం : నరేష్ (పరంపర)
ఉత్తమ హాస్య నటుడు : తాగుబోతు రమేష్ ( వెంకటాద్రి ఎక్స్ప్రెస్)
ఉత్తమ విలన్ : సంపత్ రాజ్ (మిర్చి)
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు : కొరటాల శివ (మిర్చి)
ఉత్తమ మాటల రచయిత : త్రివిక్రమ్ శ్రీనివాస్ ( అత్తారింటికి దారేది)
ఉత్తమ గేయ రచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రీ ( మరీ అంతగా, సీతమ్మ వాకిట్లో సిరమల్లె చెట్టు)
ఉత్తమ గాయకుడు : కైలాష్ ఖేర్ ( పండగలా దిగివచ్చాడు, మిర్చి)
ఉత్తమ గాయని : కల్పన (నవ మూర్తులైనట్టి, ఇంటింటా అన్నమయ్య)
ఉత్తమ ఎడిటర్ : ప్రవీణ్ పూడి (కాళీచరణ్)
ఉత్తమ బాల నటుడు : విజయ సింహారెడ్డి ( భక్త సిరియాల్)
ఉత్తమ బాల నటి : ప్రణవి ( ఉయ్యాల జంపాల)
ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత : మేర్లపాక గాంధీ (వెంకటాద్రి ఎక్స్ప్రెస్)
ఉత్తమ కథా రచయిత : ఇంద్రగంటి మోహనకృష్ణ ( అంతుకు ముందు ఆ తరువాత)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : మురళీమోహన్ రెడ్డి (కమలతో నా ప్రయాణం)
ఉత్తమ కళాదర్శకుడు : ఏ ఎస్ ప్రకాష్ (మిర్చి)
ఉత్తమ కొరియోగ్రాఫర్ : శేఖర్ వీజే (గుండెజారి గల్లంతయ్యిందే)
ఉత్తమ ఆడియోగ్రాఫర్ : ఇ రాధాకృష్ణ ( బసంతి)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ : తిరుమల ( శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ : శివ కుమార్ ( శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య)
ఉత్తమ ఫైట్ మాస్టర్ : వెంకట్ నాగ్( కాళీచరణ్ )
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ మేల్ : పీజే రవి ( బొమన్ ఇరానీ, అత్తారింటికి దారేది)
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫీ మేల్ : మిత్రా వరుణ మహి (ఉయ్యాల జంపాల)
ఉత్తమ విజువల ఎఫెక్ట్స్ : యతిరాజ్ ( సాహసం )