విడాకులకు అప్లై చేసిన బాలీవుడ్‌ కపుల్‌

27 Feb, 2020 12:36 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ నటి, దర్శకురాలు కొంకణ సేన్‌ శర్మ తాజాగా విడాకులకు దరఖాస్తు చేశారు. నటుడు రణ్‌వీర్‌ షోరేను 2010లో కొంకణ సేన్‌ వివాహం చేసుకున్నారు. ట్రాఫిక్‌ సిగ్నల్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌, ఆజా నాచ్లే వంటి సినిమాలో కలిసి నటించిన ఈ జంట అనంతరం ప్రేమలో పడి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాగా 2015లో  వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ.. పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. వీరికి ఆరేళ్ల కుమారుడు హరూన్‌ ఉన్నాడు. ఇద్దరూ విడిగా ఉంటూనే కుమారుడి బాధ్యతలు చూసుకుంటున్నారు. (నా విడాకులకు అతడు కారణం కాదు: అమలాపాల్‌)

అయితే  2015లో దూరమైన ఈ జంట ఇప్పటి వరకు విడాకులు మాత్రం తీసుకోలేదు. ఈ క్రమంలో తాజాగా వీరు అధికారికంగా విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తవ్వగా.. ఆరునెలల్లో అధికారికంగా విడాకులు అందనున్నట్లు సమాచారం. అయితే దీనికి ముందు కొంకణ, రణవీర్‌ ఇద్దరూ కౌన్సిలింగ్‌ తీసుకున్నట్లు, అయినప్పటికీ విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. (విడాకులపై పెదవి విప్పిన నటి శ్వేతాబసు)

మరిన్ని వార్తలు