నా కొడుకు జూనియర్ పవర్ స్టార్ కావొద్దు!

8 Apr, 2017 12:55 IST|Sakshi
నా కొడుకు జూనియర్ పవర్ స్టార్ కావొద్దు!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ తన కుమారుడు అకీరా నందన్ బర్త్ డే సందర్భంగా ట్విట్టర్లో ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు. గతేడాది అకీరా పుట్టినరోజు సందర్భంగా మా ఇంట్లో మూడు పండుగలంటూ ట్వీట్ చేసిన రేణు.. ఈ ఏడాది అందుకు భిన్నంగా స్పందించారు. ప్రపంచంలో తనకంటూ అకీరా పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఆపై తన కొడుకు ఎప్పటికీ జూనియర్ పవర్ స్టార్ గా ఉండకూడదని.. అకీరా నందన్ గా సొంతంగా పేరు తెచ్చుకుంటే బాగుంటుందని ఆకాంక్షించారు. తన కొడుకుపై ఆ నమ్మకం ఉందని, హ్యాపీ బర్త్ డే మై లిటిల్ స్వీట్ హార్ట్ అకీరా అని రాసుకొచ్చారు.

'అకీరాకు ఇప్పుడు 13 ఏళ్లు. అయితే ఈ వయసులోనే అకీరా ఆరడుగుల టీనేజర్ కావడంతో నమ్మలేకపోతున్నాను. అకీరా ఎప్పటికీ తల్లిదండ్రుల పేరుతో కాదు.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. ముఖ్యంగా జూనియర్ పవర్ స్టార్ అనే ముద్ర కంటే అకీరా నందన్ పేరుతోనే పాపులర్ అవ్వాలి' అని తల్లిగా నటి రేణు దేశాయ్ కోరుకుంటున్నారు.