ఆదిత్యకు మరో అవార్డు!

12 Jun, 2016 23:27 IST|Sakshi
ఆదిత్యకు మరో అవార్డు!

మాజీ రాష్ట్రపతి డా. ఏ.పి.జె అబ్దుల్ కలాం స్ఫూర్తితో ఓ ప్రభుత్వ పాఠశాలలో చదివే ఓ విద్యార్థి జూనియర్ సైంటిస్ట్ అవార్డు ఎలా కైవసం చేసుకున్నాడనే కథాంశంతో తెరకెక్కిన బాలల చిత్రం ‘ఆదిత్య... క్రియేటివ్ జీనియస్’. స్వీయదర్శకత్వంలో భీమగాని సుధాకర్ గౌడ్ నిర్మించిన ఈ బాలల చిత్రం అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో నిర్వహించిన జెన్రీ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఉత్తమ చిత్రం అవార్డుతో పాటు న్యూయార్క్ సన్ ఫెస్ట్ 2016 పురస్కారాన్ని సొంతం చేసుకుంది.

దర్శక-నిర్మాత మాట్లాడుతూ- ‘‘తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నాం. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు అవార్డులు కూడా రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు.