సూపర్‌ హిట్‌ సినిమాకు సీక్వెల్‌.. విజయ్‌ సేతుపతికి జోడీగా మలయాళ బ్యూటీ

18 Nov, 2023 06:41 IST|Sakshi

మలయాళ నటి మంజు వారియర్‌కు కోలీవుడ్‌లోకి అవకాశాలు వరుస కడుతున్నాయి. మాలీవుడ్‌లో ప్రముఖ కథానాయకిగా రాణించిన ఈ భామ అక్కడ ఒక సమస్యలో ఇరుక్కోవడంతో నటనకు చిన్న గ్యాప్‌ వచ్చింది. ఆ సమస్య నుంచి బయట పడడంతో మళ్లీ నటనపై దృష్టి సారించింది. ఇలా ధనుష్‌కు జంటగా అసురన్‌ చిత్రంలో నటించింది. ఆ చిత్రం విజయం సాధించడంతో మంజు వారియర్‌ ఇక్కడ మంచి మార్కెట్‌ వచ్చింది. ఆ తరువాత తుణివు తదితర చిత్రాల్లో నటించిన ఈమె తాజాగా రెండు తమిళ చిత్రాల్లో నటిస్తోంది.

అందులో ఒకటి సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న 170 చిత్రం కాగా రెండోది విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న విడుదలై 2. హాస్య నటుడు సూరిని హీరోగా పరిచయం చేస్తూ వెట్రిమారన్‌ దర్శకత్వం వహించిన విడుదలై చిత్రంలో విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రను పోషించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం విడుదలై 2 చిత్ర షూటింగ్‌ జరుగుతోంది.

తొలి భాగంలో నటుడు సూరి పాత్రకు ప్రాధాన్యతనిచ్చిన దర్శకుడు వెట్రిమారన్‌ రెండో భాగంలో విజయ్‌ సేతుపతి పాత్రను హైలైట్‌ చేసి షూటింగ్‌ను నిర్వహిస్తున్నారని తెలిసింది. కాగా ఇందులో ఆయనకు జంటగా నటి మంజు వారియర్‌ను ఎంపిక చేశారు. ఇందులో ఈమె పల్లెటూరి యువతిగా నటిస్తోంది. ఈ జంటకు సంబంధించిన సన్నివేశాలను దర్శకుడు ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. విడుదలై 2 చిత్రాన్ని 2024లో సమ్మర్‌ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు