జూలై నుంచి షురూ?

30 May, 2020 07:06 IST|Sakshi

ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెరకెక్కుతున్న భారీ చిత్రాల్లో మణిరత్నం తెరకెక్కిస్తున్న తమిళ చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ ఒకటి. విక్రమ్, ఐశ్వర్యారాయ్, కార్తీ, ‘జయం’ రవి, త్రిష ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చారిత్మ్రాతక చిత్రం ఇది. తమిళ నవల ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కరోనా వల్ల అన్ని సినిమాల్లానే ఈ సినిమా చిత్రీకరణ కూడా ఆగిపోయింది. అయితే జూలై నెలాఖరు నుంచి ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలని ప్లాన్‌ చేస్తున్నారట. అందుకోసం పాండిచ్చేరిలో ఓ షెడ్యూల్‌ ప్లాన్‌ చేశారు. నెలరోజుల పాటు ఈ భారీ షెడ్యూల్‌ జరగనుందట. విక్రమ్, ఐశ్వర్యా రాయ్, కార్తీ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారట. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం ఏఆర్‌ రెహమాన్‌.

మరిన్ని వార్తలు