జేమ్స్‌ బాండ్‌ మూవీలా...

21 Jul, 2017 23:44 IST|Sakshi
జేమ్స్‌ బాండ్‌ మూవీలా...

తమిళ స్టార్‌ హీరో అజిత్‌– దర్శకుడు శివలది హిట్‌ కాంబినేషన్‌. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరం, వేదాళం’ ఘన విజయం సాధించాయి. ఈ కాంబినేషన్‌లో తాజాగా తెరకెక్కిన చిత్రం ‘వివేగం’.  కాజల్‌ కథానాయిక. టీజీ త్యాగరాజన్‌ సమర్పణలో సెంథిల్‌ త్యాగరాజన్, అర్జున్‌ త్యాగరాజన్‌ తమిళంలో నిర్మించారు. ఈ చిత్రాన్ని వంశధార క్రియేషన్స్‌ పతాకంపై నవీన్‌ శొంఠినేని ‘వివేకం’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. నవీన్‌ శొంఠినేని మాట్లాడుతూ– ‘‘110 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘జేమ్స్‌ బాండ్‌’ తరహా మూవీగా తెరకెక్కిన చిత్రమిది.

తెలుగు టీజర్‌ ఇప్పటికే సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ‘ప్రేమ పుస్తకం, ప్రేమలేఖ, వీరుడొక్కడే’ వంటి చిత్రాలతో అజిత్‌ తెలుగులోనూ హిట్స్‌ సాధించారు. బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. తెలుగులో ‘శౌర్యం, శంఖం, దరువు’ వంటి హిట్‌ చిత్రాలను శివ తెరకెక్కించారు. అజిత్‌తో ఆయన చేసిన ఈ మూడో సినిమా కూడా ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. అనిరుథ్‌ రవిచంద్రన్‌ పాటలు ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి