ఏంటా ప్రమాదం?

3 Dec, 2018 05:54 IST|Sakshi
రామ్‌ కార్తీక్

లైట్‌ హౌస్‌ సినీ మ్యూజిక్‌ పతాకంపై కె.శివశంకర రావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘అక్కడొకడుంటాడు’.  రామ్‌ కార్తీక్, శివ హరీశ్, రసజ్ఞ దీపిక, అలేఖ్య హీరో హీరోయిన్లు. శ్రీపాద విశ్వక్‌ దర్శకత్వం వహించారు. శివ కంఠంనేని, ‘అల్లరి’ రవిబాబు, వినోద్‌ కుమార్, ఇంద్రజ  ముఖ్య పాత్రలు చేశారు. రావుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ–‘‘డ్రంకన్‌ డ్రైవ్‌ వల్ల కలిగే అనర్థాలను సందేశాత్మకంగా ఇందులో చూపించాం. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలతో పాటు, వరంగల్‌ దగ్గరలోని లక్నవరం ఫారెస్ట్‌లో చిత్రీకరించాం’’ అన్నారు. ‘‘అనుకోని ఆపదలో చిక్కుకున్న ప్రేమ జంటకు స్నేహితుల సహాయం అందే సమయంలో మరో ప్రమాదం ఎదురవుతుంది. ఆ ప్రమాదం నుంచి ఈ జంట ఎలా బయటపడ్డారన్నదే కథాంశం’’  అన్నారు శ్రీపాద విశ్వక్‌ . 

మరిన్ని వార్తలు