బన్నీ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌

12 Oct, 2019 19:10 IST|Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌. బన్నీ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురములో..’ సినిమా రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది. అందరూ ఊహించనట్లే ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. వచ్చే ఏడాది జనవరి 12న సినిమా విడుదల కాబోతుందని చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్‌ లుక్‌, బన్నీ డైలాగ్‌, ‘సామజవరగమన’సాంగ్‌, పోస్టర్‌ ఈ సినిమాపై హైప్‌ను క్రియేట్‌ చేశాయి.

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను గీతాఆర్ట్స్‌, హారికా హాసిని క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టబు, జయరామ్, సుశాంత్, నివేదా పేతురాజ్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తున్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా