సిగ్గుప‌డ‌ను.. చాలా వింత‌గా ఉంది

30 Mar, 2020 18:06 IST|Sakshi

‘మీరు కాపీ కొట్ట‌డం విచిత్రంగా ఉంది. అంతేకాదు.. సిగ్గుప‌డాల్సి వ‌స్తోంది’ అంటూ బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్‌పై విరుచుకుప‌డ్డాడో నెటిజ‌న్‌. శుక్ర‌వారం బిగ్‌బీ ఓ ప‌వ‌ర్‌ఫుల్ సూక్తికి త‌న బ్లాక్ అండ్ వైట్ ఫొటోను జోడించి ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. దీనిపై స‌ద‌రు నెటిజ‌న్‌ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశాడు. ‘ఇది చార్లెస్ డార్విన్ చెప్పిన సూక్తి. దాన్ని మీరు ఇంగ్లిష్ నుంచి హిందీలోకి య‌థాత‌థంగా రాసేసుకున్నారు. ఇది చాలా ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించ‌డంతోపాటు ఎంతో బాధ క‌లిగిస్తోంది. దాన్ని కాపీ కొట్టిన‌ప్ప‌టికీ చార్లెస్ పేరు ప్ర‌స్తావించి ఉంటే బాగుండేది.. కానీ మీరు ఆ ప‌ని చేయ‌క‌పోవ‌డం సిగ్గుచేటు’ అని పేర్కొన్నాడు. దీనికి బిగ్‌బీ గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇచ్చారు.

‘మీరు ఆ పోస్ట్‌ను జాగ్ర‌త్త‌గా చ‌ద‌వ‌కుండానే నాపై దాడికి దిగారు. ఇది నాకూ చాలా వింత‌గా, విచారంగానూ ఉంది. మీ భాష‌లో చెప్పాలంటే ఇది నిజంగా సిగ్గుచేటు అన‌వ‌చ్చు. కానీ నేను నేర్చుకున్న విలువ‌లు న‌న్ను అలా అన‌నివ్వ‌ట్లేదు. నేను ఆ వాక్యాల‌ను కోడ్స్‌(") ఉప‌యోగించి రాశాను. అంటే అది నేను రాసింది కాద‌ని అర్థం. ముందు మీరిది తెలుసుకోండి. ఒక‌వేళ నావైపు త‌ప్పు జ‌రిగి ఉంటే దాన్ని స‌రిదిద్దుకునేందుకు, మార్చుకునేందుకు, ఆఖ‌రికి క్ష‌మాప‌ణ చెప్ప‌డానికి వెనుకాడ‌లేదు. అలా అని మీరు నోటికొచ్చిన‌ట్లుగా మాట్లాడి, ప‌రుష ప‌దాలు వాడినందుకూ నేను సిగ్గుప‌డ‌ను. ముందు మీరు సుర‌క్షితంగా ఉండండి. భార‌తీయులైతే ఇంట్లోనే ఉండండి. లాక్‌డౌన్ అమ‌ల్లో ఉన్న నేప‌థ్యంలో కాలు బ‌య‌ట‌కు పెట్ట‌కండి’ అని గ‌ట్టిగానే మంద‌లించారు. (కరోనాపై బాలీవుడ్‌ సెలబ్రిటీల సూచనలు)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా