Allu Arjun: మంగళవారం ఈవెంట్.. ముఖ్య అతిథిగా పుష్ప!

9 Nov, 2023 18:42 IST|Sakshi

'ఆర్ఎక్స్ 100', 'మహాసముద్రం' చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన  తాజా చిత్రం 'మంగళవారం'. ఈ చిత్రంలో  పాయల్ రాజ్‌పుత్, 'రంగం' ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించారు.  ఈ చిత్రాన్ని అజయ్ భూపతి ఏ  క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. 

ఈ నెల 11న హైదరాబాద్ జేఆర్సీ కన్వెషన్ సెంటర్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతే కాకుండా ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వస్తున్నట్లు తెలిపారు.  కాగా.. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ చూస్తే 'ఆర్ఎక్స్ 100' తరహాలో ఈ మూవీనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది.  ఈ సినిమాలో నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.  కాగా.. నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. 

మరిన్ని వార్తలు