ఆ వార్తలపై అనసూయ సీరియస్..!

22 Jun, 2017 12:36 IST|Sakshi
ఆ వార్తలపై అనసూయ సీరియస్..!

బుల్లితెరపై సత్తా చాటి, ప్రస్తుతం వెండితెర మీద అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న యాంకర్ అనసూయ, తనపై సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న వార్తలపై సీరియస్ అయ్యింది. కొద్ది రోజులుగా అనసూయ లావు తగ్గేందుకు సర్జరీ చేయించుకుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వార్తలను ఓ అభిమాని అనసూయి దృష్టికి తీసుకురావటంతో ఆమె క్లారిటీ ఇచ్చింది. తాను షార్ట్ కట్స్ నమ్మనని.. ఎలాంటి సర్జరీ చేయించుకోవటం లేదని తెలిపింది. నా నుంచి ఎలాంటి సమాచారం తీసుకోకుండానే ఇలాంటి వార్తలను క్రియేట్ చేస్తున్నారని తెలిపింది.