ల్యూక్ రోంచీ అనూహ్య నిర్ణయం..

22 Jun, 2017 12:36 IST|Sakshi
ల్యూక్ రోంచీ అనూహ్య నిర్ణయం..

వెల్లింగ్టన్:న్యూజిలాండ్ క్రికెట్ జట్టులో పించ్ హిట్టర్ గా పేరొందిన ల్యూక్ రోంచీ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. మూడు ఫార్మాట్ల నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. తన కెరీర్ కు ముగింపు ఇదే సరైన సమయమంటూ 36 ఏళ్ల రోంచీ పేర్కొన్నాడు. న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు ఆడటంతో తన కల నెరవేరినట్లు పేర్కొన్న రోంచీ..ఒకే సమయంలో మూడు ఫార్మాట్లకు ప్రాతినిథ్యం వహించడం మధురమైన జ్ఞాపకంగా అభివర్ణించాడు.

తన వన్డే కెరీర్ ను 2008లో ఆరంభించిన రోంచీ  85 మ్యాచ్ లు ఆడి 1397 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి. వన్డేల్లో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 170 నాటౌట్. 32 అంతర్జాతీయ ట్వంటీ 20 లు ఆడిన రోంచీ ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. ట్వంటీ 20ల్లో అతని అత్యధిక స్కోరు 51 నాటౌట్. ఇక టెస్టు కెరీర్ లో నాలుగు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. 2015లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన రోంచీ..8 ఇన్నింగ్స్ ల్లో 319 పరుగులు చేశాడు. టెస్టుల్లో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 88.


 

మరిన్ని వార్తలు