'యాంటీ డ్రగ్స్‌ వాక్‌'లో అనసూయ

23 Jul, 2017 16:13 IST|Sakshi
'యాంటీ డ్రగ్స్‌ వాక్‌'లో అనసూయ

హైదరాబాద్‌: తెలుగు సినిమా పరిశ్రమను డ్రగ్స్ కేసు ఒక్క కుదుపుకు గురిచేసింది. ఏమీడియాలో చూసినా డ్రగ్స్‌ కేసు గురించే చర్చలు, డిబేట్లు జరుగుతున్నాయి. 12 మంది సినీ ప్రముఖులు డ్రగ్స్‌ తీసుకుంటున్నారంటూ ఆరోపణలు రావడంతో సినీ పరిశ్రమతో పాటు అభిమానులు కలవరపాటుకు గురయ్యారు. మెత్తం 12 మందికి స్సెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం (సిట్‌) నోటీసులు జారీ చేయడం, ఒక్కో రోజు ఒక్కోక్కరిని విచారిస్తుండడం ఇండస్ట్రీలో అలజడి రేపుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో డ్రగ్స్‌-అనర్థాలపై అవగాహన కలిగించేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. అవి నిర్వహించే కార్యక్రమాల్లో ప్రముఖ సినీ నటులు పాల్గొని తమ మద్దతు తెలియచేస్తూ తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు.
 
కళామందిర్ ఫౌండేషన్, హైదరాబాద్ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 30న హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు వద్ద ‘యాంటీ డ్రగ్ వాక్’ను నిర్వహించనున్నారు. ఈకార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.  జబర్దస్త్ యాంకర్ అనసూయ కూడా డ్రగ్స్ మహమ్మారిపై పోరాడేందుకు, ఈకార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకొచ్చింది. ‘డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం రండి’ అంటూ అనసూయ తన ట్విట్టర్‌ అకౌంట్లో పోస్టు చేసింది.