అతిథిగా ఆండ్రియా

4 Nov, 2019 03:09 IST|Sakshi
ఆండ్రియా

లీడ్‌ రోల్, కీలక పాత్ర, అతిథి పాత్ర... ఇలా ఏదైనా సరే పాత్ర భిన్నంగా ఉంటే రెడీ అంటారు గాయని, నటి ఆండ్రియా. ప్రస్తుతం మూడు తమిళ సినిమాల షూటింగ్స్‌తో బిజీబిజీగా ఉన్నారామె. ఈ ఏడాది ఆండ్రియా థియేటర్‌లో కనిపించనేలేదు. మూడు సినిమాలూ చిత్రీకరణ దశలోనే ఉండటమే అందుకు కారణం. తాజాగా మరో సినిమా కూడా అంగీకరించారట ఆండ్రియా. విజయ్‌ హీరోగా ‘ఖైదీ’ ఫేమ్‌ లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ఓ గ్యాంగ్‌స్టర్‌ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో విజయ్‌ సేతుపతి విలన్‌ పాత్రలో, మాళవికా మోహనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆండ్రియాను ఓ కీలక పాత్ర కోసం సంప్రదించారట చిత్రబృందం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ  ఢిల్లీలో జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారట ఆండ్రియా.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా