చిరు కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో ‘విశ్వంభర’.. తొలిసారి అలాంటి పాత్రలో

25 Nov, 2023 17:35 IST|Sakshi

ఈ ఏడాది చిరంజీవి ఖాతాలో ఓ భారీ హిట్‌తో పాటు ఫ్లాప్‌ కూడా పడింది. జనవరిలో రిలీజైన వాల్తేరు వీరయ్య.. దాదాపు రూ. 225 కోట్లకు పైగా వసూళ్లను గ్రాస్‌ వసూళ్లను సాధించి..చిరు సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి చూపించింది. అయితే అదో జోష్‌తో భోళా శంకర్‌ పేరుతో ఆగస్ట్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బోల్తా పడింది. చిరు కెరీర్‌లో భారీ డిజాస్టర్‌గా భోళా..నిలిచింది. దీంతో మెగాస్టార్‌ తన ప్లానింగ్‌ మొత్తాన్ని మార్చేశాడు. బ్రోడాడీ రీమేక్‌ ప్లాన్‌ని పక్కకి పెట్టి..బింబిసార డైరెక్టర్‌ వశిష్ట కథకు ఓకే చెప్పాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. చిరంజీవి సినిమా సెట్‌లో సందడి చేస్తున్నారు. 

చిరు కేరీర్‌లోనే భారీ బడ్జెట్‌
భోళా శంకర్‌ లాంటి  డిజాస్టర్‌ తర్వాత పవర్‌ఫుల్‌ స్టోరీతో కమ్‌బ్యాక్‌ ఇవ్వాలని చూస్తున్నారు చిరంజీవి. అందుకే తన కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కే సినిమాతో రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ చిత్రానికి విశ్వంభర అనే టైటిల్‌ని ఖారురు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.  దాదాపు రూ. 250-300 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. చిరు కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రమిది. 

అలాంటి పాత్రలో చిరంజీవి
సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి విచిత్రమైన పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.  చిరు కెరీర్‌లోనే ఇప్పటి వరకు గోదావరి జిల్లాలకు చెందిన వాడిగా ఎప్పుడు నటించలేదు. ఈ చిత్రంలో మొదటి సారిగా గోదావరి యాసలో మాట్లాడుతూ.. అలరించబోతున్నాడట. చిరు పాత్ర పేరు దొరబాబుగా ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది.  ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

మరిన్ని వార్తలు