'అది నేనే, కానీ ఆ సినిమాలో కాదు'

10 Feb, 2016 16:23 IST|Sakshi
'అది నేనే, కానీ ఆ సినిమాలో కాదు'

మలయాళ సూపర్ హిట్ సినిమా ప్రేమమ్తో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ అందుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం మలయాళంతో పాటు ఇతర సౌత్ సినిమాలలో నటిస్తున్న ఈ బ్యూటీ ప్రేమమ్ తెలుగు రీమేక్గా రూపొందుతున్న మజ్ను సినిమాలో నాగ చైతన్యకు జోడిగా నటిస్తోంది. అయితే ఈ సినిమాను అనుపమ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో రివీల్ చేస్తూ కొన్ని ఫోటోలు నెట్లో హల్చల్ చేస్తున్నాయి.

అయితే ఈ ఫోటోలపై స్పందించిన అనుపమ ఆ ఫోటోలలో ఉన్నది తానే కానీ, అది మజ్ను సినిమా షూటింగ్లో కాదంటూ క్లారిటీ ఇచ్చింది. తాను ఇంతవరకు మజ్ను షూటింగ్లో పాల్గొనలేదన్న అనుపమ, మార్చిలో తాను షూటింగ్లో పాల్గొంటున్నట్టుగా తెలిపింది. అనుపమతో పాటు శృతిహాసన్, మడోనా సెబాస్టియన్లు కూడా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు కార్తీకేయ ఫేం చందూ మొండేటి దర్శకుడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి