శ్యామ్‌ కే నాయుడిపై మోసం కేసు

27 May, 2020 19:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని సినిమాటోగ్రాఫర్‌ శ్యామ్‌ కే నాయుడుపై సినీ ఆర్టిస్ట్‌ సాయి సుధ ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు శ్యామ్‌ కే నాయుడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఐదేళ్ల నుంచి శ్యామ్‌తో సహజీవనం చేస్తున్నానని, ఈ విషయం శ్యామ్‌ సోదరుడు చోటా కే నాయుడికి తెలుసునని సాయిసుధ తెలిపారు. పెళ్లిచేసుకోమని గట్టిగా అడిగితే తనను ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని చెప్పారు. శ్యామ్‌తో తాను మాట్లాడిన ఫోన్‌ సంభాషణల రికార్డ్స్ ఉన్నాయని వెల్లడించారు. ఇంట్లో సమస్యలు ఉన్నాయని చెప్పి తనకు శ్యామ్‌ దగ్గరయ్యాడని అన్నారు. చాలాసార్లు కేసు పెట్టడానికి ప్రయత్నించినా తనను చోటా కే నాయుడు వారించారని, ఇప్పుడేమో కేసు పెట్టుకుంటే పెట్టుకో అంటున్నారని వాపోయారు. తనకు న్యాయం చేయాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సాయి సుధ కోరారు.

కాగా, పోకిరీ, దేశముదురు, సూపర్‌, బిజినెస్‌మాన్‌ తదితర సినిమాలకు శ్యామ్‌ కే నాయుడు కెమెరామన్‌గా పనిచేశారు. 2017లో టాలీవుడ్‌లో సంచలనం రేపిన హైదరాబాద్‌ డ్రగ్స్‌ కేసులో కేసులోనూ ఆయన పేరు వినిపించింది. ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్‌) అధికారులు 10 గంటలకు పైగా ఆయనను ప్రశ్నించారు. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో గుర్తింపు పొందిన సాయి సుధ.. విజయ్‌ దేవరకొండ ‘అర్జున్‌రెడ్డి’లో కీలకపాత్ర పోషించారు. (రాకేష్‌ మాస్టర్‌పై మాధవీలత ఫైర్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా