వెంటనే ఓకే చెప్పేశా - నితిన్

25 Aug, 2015 00:38 IST|Sakshi
వెంటనే ఓకే చెప్పేశా - నితిన్

‘‘నా మనసుకు చాలా దగ్గరైన సినిమా ఇది. ‘ఇష్క్’ తర్వాత రకరకాల కథలు వింటున్నప్పుడు గౌతమ్‌మీనన్ ఈ కథ గురించి చెప్పారు. కథ విని వెంటనే ఓకే చెప్పేశా’’ అని హీరో నితిన్ చెప్పారు. దర్శకుడు గౌతమ్‌మీనన్ సమర్పణలో నితిన్, యామీ గౌతమ్ జంటగా వెంకట్ సోమసుందరం, రేష్మ ఘటాల, సునీత తాటి నిర్మించిన  చిత్రం ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’. ప్రేమ్‌సాయి దర్శకుడు. కార్తీక్, అనూప్ రూబెన్స్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన అఖిల్ మాట్లాడుతూ-‘‘గౌతమ్ మీనన్‌గారు డెరైక్ట్ చేసిన సినిమాల్లో కథలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. తొలి సారిగా ఆయన తెలుగులో నిర్మించిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు.

‘‘ప్రేమ్‌సాయి చాలా ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారు. అన్ని కష్టాలను దాటి ఇప్పుడు ఈ సినిమాతో ముందుకు వ స్తున్నాం’’ అని నిర్మాత గౌతమ్‌మీనన్ తెలిపారు. నితిన్‌తో కలిసి పనిచేయడం మంచి ఎక్స్‌పీరియన్స్ అని దర్శకుడు ప్రేమ్‌సాయి అన్నారు. ఈ వేడుకలో రచయిత కోన వెంకట్, హీరోలు నాగైచె తన్య, నాని, రానా, నిర్మాతలు ‘మల్టీ డైమన్షెన్’ రామ్మోహనరావు, సునీత తాటి తదితరులు పాల్గొన్నారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి