బీబీ3 లుక్‌

10 Jun, 2020 01:24 IST|Sakshi

‘సింహా’ (2010), ‘లెజెండ్‌’ (2014) వంటి సూపర్‌హిట్స్‌ తర్వాత హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మూడో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నేడు (బుధవారం) బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా బీబీ3 (బాలకృష్ణ–బోయపాటి) ఫస్ట్‌ రోర్‌ పేరుతో ఓ లుక్‌ను, 64 సెకండ్స్‌తో ఉన్న ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు