28 Jul, 2018 00:23 IST|Sakshi

ఏదైనా జరగొచ్చు అంటే ఇదేనేమో. చిన్న మాట పెద్ద చర్చకు దారి తీసి రచ్చ రచ్చ అయింది. అసలేం జరిగిందో ఓసారి చూద్దాం. ఈ వారం లగ్జరి బడ్జెట్‌ టాస్క్‌లో భాగంగా హౌజ్‌మేట్స్‌ను మూడు టీమ్స్‌గా విడిపోయి ఆడాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. ఈ టాస్క్‌లో కౌశల్‌, దీప్తి, నందిని టీమ్‌ గెలిచారు. అయితే ఈ విజయానికి కానుకగా కొన్ని ఫుడ్‌ ఐటమ్స్‌ ఈ సభ్యులకు వచ్చాయి...

వీటిని మిగతా ఇంటి సభ్యులకు కూడా ఇవ్వొచ్చా అంటూ బిగ్‌బాస్‌ను అడుగుతుండగా విన్నానని అది తనకు నచ్చలేదని కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న గీతా మాధురికి తనీష్‌ చెప్పాడు. ఇదే విషయాన్ని ఇంటి సభ్యులందరిని కూర్చోబెట్టి సభాముఖంగా కౌశల్‌, దీప్తి, నందినిలను అడిగారు గీతా మాధురి. దీప్తి, నందినిలు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పగా.. కౌశల్‌ మాత్రం అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా.. మా టీమ్‌ గెలిస్తే... ఇంటిలోని ఓ ఇద్దరు సభ్యులు మా టీమ్‌కు కంగ్రాట్స్‌ చెప్పలేదంటూ వింత సమాధానం చెబుతూ.. ఇంటిలోని అందరు సభ్యులు మంచిగా ఉండాలని అందరం కలిసే లగ్జరి బడ్జెట్‌ పంచుకుందాం అంటూ చెప్పుకొచ్చాడు. 

మధ్యలో గీత కలగజేసుకుంటూ ఆ ఇద్దరి సభ్యులెవరో చెప్పండి అనగా .. ఒకరు బాబు గోగినేని అని కౌశల్‌ చెప్పగా.. రెండో వ్యక్తి నేనేనంటూ తనీష్‌ చెప్పాడు. ఈ తతంగం అంతా జరుగుతుంటే ... బాబు గోగినేని స్టాప్‌ దిస్‌ నాన్‌సెన్స్‌ అంటూ.. నేను కంగ్రాట్స్‌ చెప్పలేదు కాబట్టి.. నాకు లగ్జరీ బడ్జెట్‌ వచ్చిన ఐటమ్స్‌ వద్దు అని చెబుతుండగా.. నాకు కూడా వద్దంటూ తనీష్‌, సామ్రాట్‌లు తెలిపారు. 

బాబు గోగినేని నాన్‌ సెన్స్‌ పదం వాడటంతో గీత హర్ట్‌ అయ్యారు. కెప్టెన్‌ పదవిపై గౌరవం ఉంటే.. కెప్టెన్‌ మాట్లాడుతుంటే మధ్యలో ఎవరూ మాట్లాడకూడదంటూ ఇంటి సభ్యులందరికి గీత సూచించారు. ఇక్కడ మాట్లాడేది నాన్‌ సెన్స్‌ కాదంటూ.. ఏదో ఎమోషనల్‌గా ఇష్టమొచ్చినట్లు ఒక మాట అనేసి జరిగే చర్చను పాడు చేయొద్దంటూ బాబు గోగినేనిని గీత కోరారు. తనకు నాన్‌సెన్స్‌ అనిపిస్తే మాట్లాడుతానని, తన పేరు వచ్చిన తరువాతే తాను మాట్లాడనంటూ బాబు ఫైర్‌ అయ్యారు. 

తనకు కంగ్రాట్స్‌ చేయలేదంటూ కౌశల్‌ అనడంతో మొదలైంది ఈ గొడవ. అయితే తన ఉద్దేశ్యం మాత్రం అందరూ కలిసి ఉండాలని, ఒకరు గెలిచినప్పుడు అందరూ వచ్చి కంగ్రాట్స్‌ చెబితే బాగుంటుందని ఇంటి సభ్యులతో చెప్పుకొచ్చాడు. కంగ్రాట్స్‌ చెప్పలేదు.. కాబట్టి వారికివ్వను.. అని అన్నట్లు ఉందంటూ... ఏదో గీతా మాధురి బలవంతంగా ఒప్పించినట్లు ఉందని అందుకే తనకు లగ్జరి బడ్జెట్‌ను తీసుకోవాలని లేదంటూ.. తనీష్‌  ఇంటి సభ్యులతో చెప్పుకొచ్చాడు. టాస్క్‌ గెలిచిన తరువాత తన వద్దకు వచ్చి నేషనల్‌ స్విమ్మర్‌ కదా అంటూ ఎగతాళిగా మాట్లాడాడని అందుకు తనకు కూడా లగ్జరి బడ్జెట్‌ వద్దని సామ్రాట్‌ తెలిపాడు. 

ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ.. నేను క్యాజువల్‌గానే అన్నానని తప్పుంటే క్షమించమని కౌశల్‌ కోరాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. అందరూ నెగిటివ్‌గా ఆలోచించడం వల్లే అలా అనిపిస్తోందని, పాజిటివ్‌గా ఆలోచిస్తే అంతా మంచి గానే కనిపిస్తుందని, అందరూ అలా ఆలోచించాలని సూచించగా.. బాబు గోగినేని, తనీష్‌ ఫైర్‌ అయ్యారు. మాటా మాటా పెరిగి మంచిగా మాట్లాడలంటూ కౌశల్‌ కూడా ఫైర్‌ అవుతుండగా... బెదిరిస్తున్నావా అంటూ బాబు కూడా రివర్స్‌ అటాక్‌ చేశాడు. ఇలా గొడవంతా తారాస్థాయికి చేరుతుండగా.. కెప్టెన్‌గా గీతా మాధురి అందరిని కంట్రోల్‌ చేసి గొడవను సద్దుమణిగేలా చేశారు.

తనే చేజేతులా చేసుకుంటున్నాడని, అడిగి మరి కంగ్రాట్స్‌ చెప్పించుకోవడం బాలేదని దీప్తి, గీతా మాధురి మాట్లాడుకున్నారు. ఇక కౌశల్‌ మాత్రం ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడానికి గీతా మాధురి, దీప్తి, రోల్‌ రైడా, నందిని, పూజలతో మాట్లాడారు. ఇదిలా వుండగా.. ఈ వారం నామినేషన్‌లో ఉన్న బాబు గోగినేనిపై సోషల్‌ మీడియాలో నెగెటివ్‌ కామెంట్స్‌ వస్తున్నాయి. కౌశల్‌, గీతా మాధురిలను ఎలాగైనా బయటకు పంపించడమే తన ధ్యేయమంటూ ఇంటి సభ్యులతో అంటున్నాడు. ఈ వారం నేను వెళతానేమో.. వెళ్లాక చేసే మొదటి పని కౌశల్‌ను బయటకు పంపడమే, ఆ తరువాత గీతా మాధురిని అంటూ చెప్పుకొచ్చాడు. గత ఎపిసోడ్స్‌లో తనతో పెట్టుకుంటే హౌజ్‌లోంచి బయటకు వెళతారని కౌశల్‌ అన్నాడని.. అది నిజం కాదంటూ దాన్ని బ్రేక్‌ చేయడానికి కౌశల్‌తో పెట్టుకుంటానని చెప్పిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు